Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో నితిన్ సినిమా... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో నితిన్ సినిమా… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత వీరాభిమానో చెప్పక్కర్లేదు. గతంలో పవన్ నటించిన కొన్ని సినిమాలను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాంలో పంపిణీ చేశారు. అప్పటినుంచి పవన్ అంటే నితిన్ కు ఎంతో పిచ్చి. ఇక నితిన్ హీరో అయ్యాక కూడా తన సినిమాలలో ఎన్నోసార్లు పవన ప్రస్తావన వచ్చేలా చేస్తూ ఉంటారు. అలాగే పవన్ స్టైల్ అనుకరిస్తూ ఉంటారు. అందుకే పవన్ అభిమానులలో చాలామంది నితిన్ సినిమాలు చూస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం హీరో నితిన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం వక్కంతం వంశీ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఆ వెంటనే మైత్రి మూవీస్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో తెర‌కెక్కే సినిమాలో నితిన్ నటిస్తాడు. ఈ సినిమాపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. ఆ తర్వాత వేణు శ్రీరామ్ – దిల్ రాజు కాంబినేషన్లో మరో సినిమాకు కూడా సంతకం పెట్టేశాడు. దీని అప్డేట్ కూడా వారం పది రోజుల్లో రానుంది.

పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ పూర్తిగా ఖాళీగా ఉండిపోయాడు. మధ్యలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా అన్నారు. అది ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా లేదు. దీంతో వేణు శ్రీరామ్ కు ఒక సినిమా సెట్ చేయాలని దిల్ రాజు గట్టిగానే ప్రయత్నించారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దగ్గర తమ్ముడు అనే స్క్రిప్ట్ తో ఒక కథ రెడీగా ఉంది. నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాకు సీక్వెల్ గా ఈ తమ్ముడు కథను శ్రీరామ్ రాసుకున్నాడు. అయితే నాని ఈ కథలో నుంచి అవుట్ అయ్యాడు. చివరకు ఇది నితిన్‌తో సెట్ అయింది.

ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా పీఏ. అరుణ్‌ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయింది. 1999లో రిలీజ్ అయిన తమ్ముడు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రీతీ జింగానీయ హీరోయిన్గా నటించింది. యూత్ లో పవన్ కళ్యాణ్ కు తిరుగులేని క్రేజ్ రావటంలో ఈ సినిమా బాగా హెల్ప్ అయ్యింది. మరి ఇప్పుడు అదే టైటిల్ తో నితిన్ మ్యాజిక్ చేస్తాడా లేదా ? అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news