టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు..సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా సమంత – నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కాగా టాలీవుడ్ కింగ్ హీరో నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత .. కొన్నాళ్లకే విడాకులు వచ్చేసి దూరంగా బ్రతుకుతుంది. కాగా వీళ్ళిద్దరిని కలిపిన సినిమా ఏం మాయ చేసావే . వీళ్ళిద్దరూ ఫస్ట్ జత కట్టింది ఆ సినిమాతోనే.
రీసెంట్ గానే ఆ సినిమా 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా ఇద్దరు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు . ఈ క్రమంలోనే సమంతకి – నాగచైతన్య పై ఎలా ఇష్టం ఏర్పడిందో అనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఏ మాయ చేసావే” సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షూట్ అప్పుడు సమంత – నాగచైతన్య ను దూరం నుంచి చూసిందట. అప్పుడే కారులో నుంచి దిగాడట చై.
అతనను చూసి “ఇతగాడా హీరో ..?” అంటూ అవ్వక్కైందట . అంతేకాదు సమంత కు చాలా భయం గా ఉండిందట. ఈ క్రమంలోని ఫస్ట్ సీన్ వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తూ ..” నీ వయసెంత అంటే చై 22 అంటాడు..అప్పుడు సమంత నాకు 24..పర్లేదు మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తాను” అంటూ సమంత చెప్పగా నాగచైతన్య..” నువ్వు నా సిస్టర్ అనుకోవట్లేదు” అంటూ ఒక డైలాగ్ చెప్తాడు.
ఆ డైలాగే అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ డైలాగ్ తోనే సమంత – నాగచైతన్య అంటే ఇంప్రెస్స్ అయిపోయిందట. నాగచైతన్య ఆ డైలాగులను పదేపదే గుర్తుచేసుకొని నవ్వుకున్నారట . ఆ తర్వాత ఆ పరిచయం ఫ్రెండ్షిప్ గా మారి.. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి.. ఆ తర్వాత ప్రేమ – పెళ్లి వరకు వెళ్లి .. ఇప్పుడు పెటాకులు కూడా అయిపోయింది. ఇదే క్రమంలో సమంత ఫ్యాన్స్ ఈ సీన్ జరగకుండా ఉంటే ఎంత బాగుండో.. సమంత లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ సమంత పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది..!!