అక్కినేని కుర్రాడు అఖిల్‌కు ఎంత మాత్రం కాలం కలిసి రావట్లేదు. బ్యాచిలర్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇప్పటకీ అఖిల్ నటించిన సినిమా ఏదీ థియేటర్లలోకి రాలేదు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన భారీ సినిమా ఏజెంట్ రెండేళ్లకు పైగా షూటింగ్ నడుస్తూనే ఉంది. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే బడ్జెట్ మాత్రం అనుకున్న దానితో పోలిస్తే డబుల్ అయిపోయిందంటున్నారు.
పైగా బడ్జెట్ ఎక్కువ కావడంతో పాటు క్వాలిటీ ఉండాలని చెప్పిన అఖిల్.. తన రెమ్యునరేషన్ కూడా వదులుకున్నాడని భోగట్టా..! ముందు ఈ సినిమా నిర్మాణంలో సురేందర్‌రెడ్డి భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత పెరిగిపోయిన బడ్జెట్ చూసి ఆయన తప్పుకున్నారని కూడా టాక్ ? ఇక ఇప్పుడు భారం అంతా నిర్మాత అనిల్ సుంకర మీదే పడిపోయింది.
ఇక అనిల్ సుంకర ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక రైట్స్‌ను హోల్‌సేల్‌గా రు. 34 కోట్లకు అమ్మేశారు. ఇది మంచి రేటే. అది కూడా జీఎస్టీ కాకుండా రు. 34 కోట్లకు ఇచ్చారట. వైజాగ్‌కు చెందిన గాయత్రి సతీష్ పోటీపడి మరీ ఈ రైట్స్‌కు రు. 34 కోట్లు పెట్టారు. కొందరు రు. 32 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనా సతీష్ పోటీ పడి మరో రు. 2 కోట్లు ఎక్కువ పెట్టి ఏజెంట్ మూడు రాష్ట్రాల రైట్స్ దక్కించుకున్నారు.
ఇక నాన్ థియేటర్ ద్వారా మరో రు. 20 కోట్లు వచ్చిందట. ఇంత అమౌంట్ వచ్చినా కూడా మరో రు. 15 కోట్ల డెఫిసిట్‌తో ఏజెంట్ రిలీజ్ అవుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను అటు చెక్కి ఇటు చెక్కి ఇప్పటకీ షూటింగ్ నడిపిస్తూనే ఉన్నాడు. చాలా రీ షూట్లతో వర్కింగ్ డేస్ భారీగా ఖర్చయ్యాయి. బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. చివరకు అఖిల్ సైతం రెమ్యునరేషన్ త్యాగం చేసే కాడకు బడ్జెట్ పెరిగిపోయింది.