MoviesSri hari "వాడు దొంగ నా కొడుకు" అని తెలిసి కూడా...

Sri hari “వాడు దొంగ నా కొడుకు” అని తెలిసి కూడా ఇంటికి పిలిచిన శ్రీహరి.. అదే కొంప ముంచిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..రియల్ హీరో శ్రీహరి ముందు ఎవ్వరూ సాటి రారు అని చెప్పాలి . మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా శ్రీహరి నటనకు ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవుతారు .. అంటే ఆయనలో ఎంత మంచి నటుడు దాగి ఉన్నాడొ మనం అర్థం చేసుకోవచ్చు . సినిమా ఇండస్ట్రీలో హీరో గానే పాత్రలు కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పాత్రలు చేసి తనదైన స్టైల్ లో జనాలను మెప్పించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

శ్రీహరి అతి చిన్న వయసులోనే మరణించారు. శ్రీహరి మరణించిన నాడు ఆయన భార్య డిస్కో శాంతి ..ఆయన కొడుకులతోపాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం కన్నీరు పెట్టుకుంది ..అంటే ఆయనకి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు . శ్రీహరిని హీరోగా కన్నా వ్యక్తిగతంగా ఇష్టపడే జనాలు ఎంతోమంది ఉన్నారు . ఆయనకు వచ్చిన సంపాదనలో సగానికి పైగా ప్రజాసేవ చేస్తూ.. సహాయం కోరి ఇంటికి వచ్చిన వారికి లేదు కాదు అనకుండా.. ఇచ్చేవారు ..అందుకే శ్రీహరి మన మధ్య లేకపోయినా ఇప్పటికీ ఆయన పేరు చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి .

కాగా శ్రీహరి చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు ఆయన భార్య డిస్కో శాంతి జనాలకు కనిపించలేదు. కాగా కొన్నాళ్ల ముందే ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త మరణానికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది . అంతేకాదు తన భర్త మనస్తత్వం ఎలాంటిదో కూడా చెప్పింది. అందరికీ తెలిసిందే శ్రీహరి చాలా మంచివాడు తెలిసి తెలిసి ఎవరికీ హాని చేయడు ..అదే విషయాని ఆమె చెప్పుకొచ్చింది . అంతేకాదు శ్రీహరిని ఆమె బావ అని పిలుస్తుందని.. ఆయన కూడా తనను సరదాగా బావ అని ఆటపట్టించే వారిని చెప్పుకొచ్చింది . అంతేనా తన ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు అంటే శ్రీహరికి మహా ప్రాణం అని చెప్పుకొచ్చింది . చీమకు కూడా హానిచేయని శ్రీహరిని ఇండస్ట్రీలో చాలా మంది మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది .

అంతేకాదు వాడు దొంగ అని తెలిసిన ఇంటికి పిలిచి మర్యాద చేసే మనస్తత్వం నా బావది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . కాగా ఇంత మంచి శ్రీహరి ఇంత చిన్న ఏజ్ లోనే ఎందుకు ప్రాణాలు కోల్పోయాడా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకి సిగరెట్ తాగే అలవాటు ఉందని ..మందు ఎక్కువగా కొడతారని ఆ కారణంగానే ఆయనకు జబ్బులు వ్యాపించాయని తద్వారా ఆయన ఆరోగ్యం క్షేణించిందని .. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్లో కుప్పకూలి పడిపోయాడని ..ఆ తర్వాత ఆయన మరణించారని జనాలు చెప్పుకుంటున్నారు . ఏది ఏమైనా సరే శ్రీహరి మన మధ్య లేడు అన్న వార్తను అంత ఈజీగా మనం మర్చిపోలేం ..అలాంటి హీరో ఇండస్ట్రీలో లేడు.. ఇకపై రాబోడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news