MoviesRRR బ్రేకింగ్‌: నాటునాటుకు ఆస్కార్ అవార్డ్ ప‌క్కా… ముందుగానే లీకులు…!

RRR బ్రేకింగ్‌: నాటునాటుకు ఆస్కార్ అవార్డ్ ప‌క్కా… ముందుగానే లీకులు…!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఇద్ద‌రి కాంబినేష‌న్లో తెరకెక్కిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ త్రిబుల్ ఆర్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా గ‌తేడాది మార్చి 25న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో పాటు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల కాంబినేష‌న్‌ను బ్యాలెన్స్ చేస్తూ రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి.

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రు. 1200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌, చెర్రీ క‌లిసి స్టెప్పులు వేసిన నాటు నాటు సాంగ్ పిచ్చ‌గా పాపుల‌ర్ అయ్యింది. చంద్ర‌బోస్ సాహిత్యం అందించిన ఈ పాట‌కు కీర‌వాణి మ్యూజిక్ అందించారు. కేవ‌లం ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌నే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా కొన్ని కోట్ల మంది సినీ ప్రియుల‌ను ఈ సాంగ్ అల‌రించింది.

ఇప్పుడు నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఆస్కార్ అవార్డుకు నామినేష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌కు ఆస్కార్ అవార్డు రావ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. దానికోస‌మే చిత్ర యూనిట్ అమెరికాకు ప్ర‌యాణం అవుతున్న‌ట్టుగా చెపుతున్నారు. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ స్వామి మాల‌లో ఉండి కూడా అమెరికాకు వెళ్లారు.

త్వ‌ర‌లోనే రాజ‌మౌళి, ఎన్టీఆర్ కూడా అమెరికాకు ప్ర‌యాణం అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ఫ‌లితాలు రానున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 20 రోజుల టైం ఉండ‌గానే రామ్‌చ‌ర‌ణ్ అమెరికాకు వెళ్ల‌డం.. త్వ‌ర‌లోనే రాజ‌మౌళి, ఎన్టీఆర్ కూడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండ‌డం చూస్తుంటే నాటు నాటుకు ఆస్కార్ ప‌క్కాగా వ‌చ్చింద‌న్న సంకేతాలు వెలువుడుతున్నాయంటూ సినీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news