సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే మహమ్మారి ఎంతలా పట్టిపీడిస్తుందో నెపోటిజం అనే వైరస్ కూడా అంతలానే ఇండస్ట్రీలో పాతుకు పోయింది . స్టార్ హీరో కొడుకు స్టార్ హీరోనే అవ్వాలి అంటూ కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా కొందరు స్టార్స్ కొత్త టాలెంట్ ని కుర్రాళ్లని తొక్కి పడేస్తున్నారు . ఈ క్రమంలోనే కష్టపడి యంగ్ హీరోస్ తెరపైకి వస్తున్న సరే హిట్లు కొడుతున్నా కానీ పలుకుబడి ఉన్న కిడ్స్ కున్న పబ్లిసిటీ ..ఆ స్టార్ హీరోలకి రాలేకపోతోంది . ఈ క్రమంలోనే రీసెంట్గా నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న టాలీవుడ్ స్టార్ హీరో నాని నెపోటిజంపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.
కాగా స్మిత హోస్ట్ చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షో కి రీసెంట్ గా గెస్ట్ గా వచ్చిన టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నానికి నెపోటిజంపై ప్రశ్న ఎదురైంది . ఈ క్రమంలోనే నాని ఉన్న కోపాన్ని వెలగక్కేసినట్లు ఆయన మాటలు బట్టి క్లియర్గా అర్థం అవుతుంది . స్మిత అడిగిన ప్రశ్నకు నాని జవాబు ఇస్తూ ..” టాలీవుడ్ లో నెపొటిజాని ఎంకరేజ్ చేస్తుంది జనాలే ..ప్రేక్షకులే ఫర్ ఎగ్జాంపుల్ నాని డెబ్యూ మూవీ అంటే లక్షల్లో చూస్తారు ..ఎందుకంటే పాపులారిటీ లేదు ..క్రేజ్ లేదు.. అదే రామ్ చరణ్ మూవీ అంటే మాత్రం కోట్లల్లో చూస్తారు ఎందుకంటే మెగాస్టార్ కొడుకు. ఇదే బిగ్ డిఫరెన్స్ అంటూ నాని చెప్పకనే చెప్పేసాడు”.
ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ నాని పై మండిపడుతున్నారు . అంతేకాదు ఇదే షోకి గెస్ట్ గా హాజరైన రానా కి నెపొటిజం పౌ ప్రశ్న ఎదురవగా ..”వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీదే ఉంటుంది.. పిల్లలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలి, అప్పుడే వాళ్ళు విజయం సాధించినట్లని పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ రానా నెపొటిజానికి సపోర్ట్ చేశాడు . ఈ క్రమంలోనే టాలీవుడ్ లో బిగ్ ఫైట్ జరుగుతుంది . నాని అవుట్ సైడర్ గా.. రానా ని నెపోకిడ్ గా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!