హీరోయిన్ కృతికర్బంద తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి. బోణీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కృతి ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో చోటు దక్కించుకుంది. ఆ సినిమా ప్లాప్ అయినా కృతి అందచందాలు, ఆమె అమాయకత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే మిస్టర్ నూకయ్య – ఒంగోలు గిత్త వంటి సినిమాలతో కూడా ఆకట్టుకుంది. అయితే హీరోయిన్గా ఆమెకు అనుకున్నంత దక్కలేదు.
ఆ తర్వాత టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ హిందీలో హౌస్ ఫుల్ 4 – పాగల్ పంటి – 14 ఫెహరే వంటి సినిమాలతో ఆకట్టుకుంది. చూడటానికి బక్క పల్చగా ఉన్న అందం అభినయం విషయంలో కృతికి మంచి పేరే ఉంది. ఆ తర్వాత తిరిగి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి రాంచరణ్ హీరోగా వచ్చిన బ్రూస్లీ సినిమాలో చరణ్ కు జోడిగా నటించింది.
సినిమాల విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కృతి గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కృతి తన భాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. ఇన్నాళ్లు చాటుమాటుగా సాగిన తన ప్రేమ గుట్టంతా బయట పెట్టేసుకుంది. కృతి గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇదంతా ఇప్పటి వరకు తెరవెనక తంతులా సాగినా ఇప్పుడు మాత్రం రివీల్ అవ్వక తప్పలేదు. తన ప్రియుడు పులికిత్తో దిగిన ఫోటోలు తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఇక పులికిత్ విషయానికి వస్తే బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. పులికిత్ గతంలో శ్వేతా రోహిరా అనే హీరోయిన్ను పెళ్లాడాడు.
అయితే పెళ్లయిన యేడాదికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో అతడు కృతికి బాగా దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు డేటింగ్లో మునిగి తేలుతోన్న ఈ జంట త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారు.