ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి మంచి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ వరుసగా అవకాశాలను అందుకోలేకపోతోంది. మొదటి సినిమా హిట్ అయితే ఆ వేవ్ ఇంకో సినిమాకి కంటిన్యూ అవుతుంది. అది హిట్ అయితే ఇంకో సినిమా. ఒకవేళ రెండవ సినిమా మూడవ సినిమా గనక ఫ్లాపైతే దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్ వంక మళ్ళీ చూడటం లేదు. దీనికి ఉదాహరణ కృతిశెట్టి, కేతిక శర్మ, నేహశెట్టిలనే తీసుకోవచ్చు.
కృతిశెట్టి ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. కానీ, ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో వచ్చిన క్రేజ్ వచ్చినట్టే తగ్గిపోయింది. ఇప్పుడు కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలంటే మేకర్స్ చాలా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యలో అమ్మడు రెమ్యునరేషన్ భారీగా పెంచడం కూడా ఓ కారణం. ఇదే తరహాలో హాట్ బ్యూటీస్‌గా పేరు తెచ్చుకున్న నేహశెట్టి, కేతికలు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక్క ఊపు ఊపుతుందనుకున్న ఫరియా అబ్దుల్లా అయితే మరీ దారుణం అని చెప్పాలి. మొదటి సినిమాతో ఏకంగా ప్రభాస్‌నే మెప్పించింది. హైట్ విషయంలో ప్రభాస్‌ను బాగా ఆకటుకుంది. కానీ, హీరోయిన్‌గా మాత్రం మీడియం రేంజ్ హీరోలను కూడా ఆకట్టుకోలేకపోయింది. దానికితోడు బంగార్రాజు లాంటి సినిమాలో ఐటెం సాంగ్ చేసి తన కెరీర్‌ను తానే ముంచేసుకుంది. ఫరియాలో ఉన్న మాస్ అపీల్ చూసి యంగ్ హీరోలకి మంచి జోడీ అనుకున్నారు.
మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకి ఫరియా అబ్దుల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని చెప్పుకున్నారు. కానీ, ఒక్కటంటే ఒక్కటి కూడా అమ్మడికి సాలీడ్ ప్రాజెక్ట్ పడింది లేదు. దీనికి కారణం ఫరీయా పర్ఫార్మెన్స్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోవడమే. ఇలా వచ్చిన చాలామంది హీరోయిన్స్ కొంతకాలం తర్వాత హీరోయిన్ అని చెప్పుకోవడానికే ఇబ్బంది అడుతుంటారు. రానున్నరోజుల్లో ఫరియా పరిస్థితి కూడా ఇదే అని టాక్ వినిపిస్తోంది.