MoviesSalman Khan "ఆ విషయాని మర్చిపోలేకపోతున్న"..కియారా-సిద్ధార్ధ్ పెళ్లికి సల్మాన్ అందుకే వెళ్ళలేదా..?

Salman Khan “ఆ విషయాని మర్చిపోలేకపోతున్న”..కియారా-సిద్ధార్ధ్ పెళ్లికి సల్మాన్ అందుకే వెళ్ళలేదా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ – స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఇంట్లోనే పెద్దలను ఒప్పించి గ్రాండ్గా జైపూర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు . రాయల్ లుక్ ని తలపిస్తూ వీళ్ళు చేసుకున్న పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . పెళ్లి తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మెరిసిన ఈ జంట చూడముచ్చటగా ఉంది అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు రీసెంట్గా ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన సిద్ధార్థ – కియారా ఫంక్షన్ కి వచ్చిన అతిథులను స్వయంగా వెల్కమ్ చెప్పి మంచిగా రిసీవ్ చేసుకున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మొత్తం బాలీవుడ్ బడా సెలబ్రెటీస్ అంతా కాలు కదిపి కీయారా – సిద్ధార్థ రిసెప్షన్ ఫంక్షన్కు వచ్చి హంగామా చేస్తూ .. వాళ్ళని బ్లెస్ చేశారు . అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం కీయారా అద్వానీ – సిద్ధార్థ రిసెప్షన్ కి రాలేకపోయాడు . పెళ్లికి కూడా వెళ్లలేదు . ఈ క్రమంలోనే గతంలో ఆయన కి కియారా తో ఉన్న గొడవలను మళ్లీ తెర పైకి తీసుకొచ్చారు కొందరు ఆకుతాయిలు .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ .. సిద్ధార్ధ్ – కీయారా పెళ్లికి వెళ్లకపోవడానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ హోస్టుగా ఉండటమే అంటూ తెలుస్తుంది . సీజన్ ఫినాలే ఎపిసోడ్ కి ఆయన వేరేచోట ఉండడంతో షెడ్యూల్ ని మిస్ చేసుకోలేక కీయారా – సిద్ధార్థ పెళ్లికి వెళ్లలేనట్టు తెలుస్తుంది. అయినా కానీ ఆయన కాస్ట్లీ బహుమతినిచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కీయారా – సిద్ధార్థ ల పెళ్లికి వెళ్లాలని ఎంత ట్రై చేసినా బిగ్ బాస్ సీజన్ ని మర్చిపోలేకపోయానని .. ఆ కారణంగానే కమిట్మెంట్ ఇచ్చిన షో కోసం కన్విన్స్ చేసుకొని మరి హోస్ట్ గా చేస్తున్నానని .. కీయారా – సిద్ధార్థ లకు స్పెషల్గా విషెస్ చెబుతూ వీడియోని సెండ్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news