Moviesషాకింగ్‌: మ‌హేష్ సినిమాయే రాజ‌మౌళికి ఆఖ‌రు సినిమా..!

షాకింగ్‌: మ‌హేష్ సినిమాయే రాజ‌మౌళికి ఆఖ‌రు సినిమా..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి క్రేజ్ ఇప్పుడు ఎల్ల‌లు దాటేసింది. వ‌రుస‌గా ఈగ‌, బాహుబ‌లి 1, 2, త్రిబుల్ ఆర్ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేశాయి. ఇప్పుడు ఇండియ‌న్ సినిమా మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచ సినిమా సైతం తెలుగు వాళ్ల‌పై చూస్తోంది. ఇక స‌హ‌జంగానే ఈ సినిమాలు చూసి
దర్శకుడు రాజ‌మౌళి గొప్పోడు అని అంద‌రూ అనుకుంటాం. అయితే అంత‌కుమించిన హాన‌ర్ రాజ‌మౌళిలో ఉంది.

రాజ‌మౌళి రేంజ్ ఎల్ కేజీలో ఉన్న‌ప్పుడు తీసుకున్న అడ్వాన్స్‌ల‌కు కూడా ఇప్పుడు డాక్ట‌రేట్‌కు మించిన రేంజ్‌కు వెళ్లాక కూడా సినిమాలు చేస్తున్నాడు. సింహాద్రి త‌ర్వాత రాజ‌మౌళికి డీవీవీ దాన‌య్య‌, డాక్ట‌ర్ కేఎల్. నారాయ‌ణ ఇద్ద‌రూ అడ్వాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఇలా అడ్వాన్స్‌లు తీసుకున్నాక ఆ నిర్మాత‌ల‌ను ఏదోలా వ‌దిలించేసుకుంటున్నారు. తీసుకున్న అడ్వాన్స్‌ల‌కు వ‌డ్డీలు ఇచ్చేసి ఇత‌ర ప్రాజెక్టుల‌కు క‌మిట్ అయిపోతున్నారు.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్లు అంద‌రూ కూడా క్రేజ్ రాక‌ముందు నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్స్‌లు తీసుకుని త‌ర్వాత స్టార్లు అయ్యాక పాత అడ్వాన్స్‌ల‌కు సినిమాలు చేయ‌డం ఇష్టం లేక వారిని వ‌దిలించేసుకున్నారు. కానీ రాజ‌మౌళి అలా కాదు… 20 ఏళ్ల క్రింద‌ట తీసుకున్న అడ్వాన్స్‌ల‌కు కూడా ఇప్పుడు న్యాయం చేస్తున్నాడు. దాన‌య్య ద‌గ్గ‌ర అడ్వాన్స్ తీసుకున్నాం క‌దా ? అని చిన్నా చిత‌కా సినిమా చేయ‌లేదు.

ఇద్ద‌రు క్రేజీ హీరోల‌ను పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. నాడు దాన‌య్య వేసిన చిన్న విత్త‌నం ఈ రోజు ఆయ‌న‌కు కోట్లు కురిపించేసింది. ఇక ఇప్పుడు కేఎల్‌. నారాయ‌ణ సినిమా ఉంది. ఈ సినిమాను మ‌హేష్‌తో తీస్తున్నాడు. ఇది కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రాజెక్టు కానుంది. అయితే ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి తీసుకున్న అడ్వాన్స్‌లు లేవు. దీంతో ఇక బ‌య‌ట బ్యానర్ల‌లో రాజ‌మౌళి సినిమాలు చేయ‌డ‌నే అంటున్నారు. కేఎల్ నారాయ‌ణ‌కు చేసేదే బ‌య‌ట బ్యాన‌ర్ల‌కు ఆయ‌న చేసే చివ‌రి సినిమా అని టాక్ ?

అయితే త‌న స‌న్నిహితుడు అయిన సాయి కొర్ర‌పాటికి మాత్రం ఓ సినిమా చేస్తాడ‌ట‌. రాజ‌మౌళికి ముందు నుంచి సాయి కొర్ర‌పాటి ఎంతో హెల్ఫింగ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఏదేమైనా మ‌హేష్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి త‌న సొంత బ్యాన‌ర్లోనే సినిమాలు చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నాడ‌ట‌.. రాజ‌మౌళి అడిగితే ఫైనాన్ష్‌కు కొర‌త ఉండ‌దు. ఇటు ఎలాగూ టోట‌ల్ టీమ్ ప్రొడ‌క్ష‌న్ అంతా త‌న ఇంట్లోనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news