సీనియర్ నటుడు నరేష్ వీకే, సీనియర్ నటీమణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌పై ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు, విమర్శలకు చెక్ పడింది. న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ తాను త్వరలోనే పవిత్రను పెళ్లిచేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. అయితే తాను పవిత్రను పెళ్లి చేసుకునే విషయాన్ని ఓ వీడియో రూపంలో నరేష్ బయట పెట్టారు. అయితే తాను పవిత్రను పెళ్లి చేసుకుంటానని నరేష్ రివీల్ చేసిన వీడియో చాలా రొమాంటిక్‌గా ఉంది.
మధ్యలో ఓ కేక్.. కేక్ చుట్టూ దీపాలు వెలిగించి, నరేష్-పవిత్ర సాన్నిహిత్యంగా వచ్చి, ఒకరి పెదవలు మరొకరు ముద్దు పెట్టుకున్నారు. చివర్లో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం.. అంటూ ముగింపు ఇచ్చారు.. వీడియో చివర్లో..! అయితే నరేష్, పవిత్ర పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నా ఇక్కడ కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. అవి ఎలా సాల్వ్ చేసుకుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.
నరేష్‌కు గతంలోనూ మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి రెండు పెళ్లిళ్లు, విడాకుల విషయంలో అభ్యంతరాలు లేవు. అయితే నరేష్‌కు ఇప్పుడు మూడో భార్య రమ్య రఘుపతితో చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. ఆమె ఏపీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
రమ్యకు, నరేష్ వయస్సులో 30 ఏళ్లకు పైగా అంతరం ఉంది. వీరికి కూడా ఓ బాబు ఉన్నాడు. మనస్పర్థల నేపథ్యంలో ఐదేళ్లుగా వీరు దూరంగానే ఉంటున్నారు. నరేష్ ఎప్పుడు అయితే పవిత్రతో కలిసి ఉంటున్నాడో ? అప్పటి నుంచే రమ్య కూడా నరేష్‌పై మాటల తూటాలు పేలుస్తోంది. నరేష్, పవిత్ర బెంగళూరులో ఓ హాటల్లో ఉంటే రమ్య అక్కడ రచ్చ చేసేందుకు ట్రై చేయగా.. నరేష్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. తర్వాత పవిత్రా లోకేష్ కూడా ప్రెస్‌మీట్ పెట్టి.. రమ్య కావాలనే తనను బజారు కీడ్చేందుకు ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించారు.
ఆ తర్వాత దీనిపై మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. దీంతో తొలిసారిగా పవిత్ర పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు వీరిద్దరు అధికారికంగానే తమ బంధాన్ని కన్ఫార్మ్ చేయడంతో అసలు ఏ గొడవలు, పుకార్లు లేకుండా చేశారు. అయితే వీరి వివాహ బంధానికి నరేష్ మూడో భార్య అడ్డు తగులుతుందంటున్నారు. ఆమెకు నరేష్ విడాకులు ఇచ్చాడా ? లేడా ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.