Moviesవీర‌సింహారెడ్డి మేకింగ్ వీడియో.. ఆ మూడే టాప్‌ హైలెట్‌..!

వీర‌సింహారెడ్డి మేకింగ్ వీడియో.. ఆ మూడే టాప్‌ హైలెట్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా వీర‌సింహారెడ్డి. సంక్రాంతి కానుక‌గా వీర‌సింహారెడ్డి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జ‌న‌వ‌రి 12న వీర‌సింహుడు థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. సినిమాపై ఏ స్థాయిలో బ‌జ్ ఉందో సినిమా నుంచి రిలీజ్ అవుతోన్న స్టిల్స్‌, వీడియోలు, సాంగ్స్ చూస్తున్నా.. వాటికి వ‌స్తోన్న క్రేజ్, వ్యూస్ చూస్తుంటేనే తెలుస్తోంది.

అఖండ త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా కావ‌డం.. బాల‌య్య నుంచి సినిమా వ‌చ్చి యేడాది దాటిపోవ‌డంతో నంద‌మూరి, బాల‌య్య అభిమానుల్లో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఒక్క‌టే ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇక న్యూ ఇయ‌ర్ కానుక‌గా వీర‌సింహారెడ్డి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్ మాస్ విజువ‌ల్స్‌తో ఎగ్జైట్మెంట్‌గా ఉంది.

సినిమాలో కీల‌క స‌న్నివేశాలు అన్నీ మేకింగ్ వీడియోలు క‌నిపిస్తున్నాయి. సెంటిమెంట్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, భారీ ఫైట్లు, ఎద్దుల పోరాటాలు, విల‌న్ల‌తో బాల‌య్య చెడుగుడు ఆడుకోవ‌డాలు ఇలా చాలానే క‌నిపిస్తున్నాయి. ఓవ‌రాల్‌గా 1.46 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో మాస్ ట్రీట్‌గా ఉంది. ఈ వీడియోలో బాల‌య్య ఇద్ద‌రు కుమార్తెలు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని ఇద్ద‌రితో పాటు బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ కూడా క‌నిపిస్తారు.

మోక్ష‌జ్ఞ అయితే చాలా చార్మింగ్ లుక్‌లో క‌నిపించాడు. చాలా స్లిమ్ అయిన‌ట్టుగా ఉన్నాడు. ఇవే మేకింగ్ వీడియోకు మేజ‌ర్ హైలెట్‌. అలాగే బాల‌య్య సోద‌రుడు మోహ‌న్‌కృష్ణ కూడా క‌నిపించారు. ఇక శృతీహాస‌న్ కూడా చాలా సంద‌డి సంద‌డిగా ఉంది. బాలయ్య మాస్ ప్రెజెన్స్ తనపై చూపించిన సీన్స్ కి థియేటర్స్ షేక్ అవ్వ‌డం ఖాయంగా ఉంది. ఓవ‌రాల్‌గా థ‌మ‌న్ మ్యూజిక్ కూడా అదిరిపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news