ఈ తరం జనరేషన్లో చాలా మంది బాలయ్య చెల్లి సీత అంటే తెలీదు కాని.. 20 ఏళ్ల క్రిందట వరకు ముద్దుల మావయ్య సినిమాలో బాలయ్యకు చెల్లిగా చేసిన సీతను మామూలుగా ప్రస్తావించాలన్నా బాలయ్య చెల్లి అనేవారు. 1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మావయ్య సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య, చెల్లి పాత్రలో సీత మధ్య ఉన్న అన్నచెల్లెల్ల సెంటిమెంట్ బాగా పండడంతో పాటు సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ సినిమాతో సీతకు మంచి క్రేజ్ వచ్చి సౌత్ ఇండియాలో బాగా పాపులర్ అయ్యింది. సీత ప్రముఖ తమిళ దర్శకుడు పార్తీబన్ సినిమాల్లో నటించింది. ఈ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. 1990లో పార్తీబన్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే వచ్చిన పుదియపాదై సినిమాలో కూడా ఆమె జంటగా నటించారు. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు పుట్టాక… మనస్పర్థల నేపథ్యంలో 2001లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కొంత కాలం ఖాళీగా ఉన్న సీత రకరకాల కేసుల్లో ఇరుక్కున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అమ్మ, అక్క, వదిన పాత్రలతో మెప్పిస్తున్నారు. సీరియల్స్ చేస్తోన్న టైంలో వయస్సులో తనకన్నా చిన్నోడు అయిన సురేష్ అనే వ్యక్తిని 2010లో పెళ్లి చేసుకోగా.. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం సీత వయస్సు 55.
ఈ వయస్సులో సీత తాజాగా చేసిన ఫొటో షూట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అసలు ఈ ఫొటోల్లో ఆమె అందం చూసిన వారు, ఆమె వయస్సును పోల్చి చూసి షాక్ అవుతున్నారు. తన అవయవ సంపదను చూపించేందుకే ఆమె ఇలాంటి ఫొటోలు పెట్టారా అని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ ఫొటోల అయితే సీత కైపెక్కించే స్టిల్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. ఈ వయస్సులో సీత ఎందుకు ఇలా చూపిస్తోంది.. టాలీవుడ్లో అత్త, అమ్మ క్యారెక్టర్లతో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేస్తుందా ? అన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి.