Moviesఆ విషయంలో సమంత తప్పు లేదు..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సురేష్ బాబు..!!

ఆ విషయంలో సమంత తప్పు లేదు..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సురేష్ బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన సమంత.. ప్రజెంట్ యశోద సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చిన సమంత లేటెస్ట్ సినిమా యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మరి ముఖ్యంగా హీరో లేకపోయినా సరే కేవలం హీరోయిన్ తోనే ఇంతటి విజయం సాధించడం గ్రేట్ అంటున్నారు సినీ ప్రముఖులు .

కాగా త్వరలోనే సిటాడల్ వెబ్ సిరీస్ , శాకుంతలం , ఖుషి సినిమాలతో మన ముందుకు రాబోతున్న సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నిర్మాత సురేష్ బాబు. మనకు తెలిసిందే నాగచైతన్య వాళ్ళ తల్లి దగ్గుబాటి లక్ష్మీ,, నాగార్జున మొదటి భార్య . దగ్గుబాటి లక్ష్మీ బ్రదర్ సురేష్ బాబు అంటే నాగచైతన్యకు మేనమామ. రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన ఇండస్ట్రీలో ఈతరం మహానటి ఎవరు అనగానే టక్కున సెకండ్ కూడా ఆలోచించకుండా సమంత పేరు చెప్పేశారు.

నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీ విడాకుల తర్వాత సమంతపై ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ చేసింది లేదు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సరే ఆమె గురించి ట్విట్ చేయలేదు ఇలాంటి క్రమంలోనే సురేష్ బాబు ఆమె ఏకంగా మహానటి అని పోల్చడం ఇండస్ట్రీలో షాకింగ్ గా అనిపించింది. అంతేకాదు దీంతో సమంత ఫ్యాన్స్ ఈ మాటలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు . సురేష్ బాబు నే మహానటి అంటూ ఆమెను ప్రశంసించారు . దీన్ని బట్టి నిజంగానే విడాకులు విషయంలో సమంత తపు ఏమీ లేదు ..నాగచైతన్య నే ఏదో రాంగ్ థింకింగ్ లో డివర్స్ ఇచ్చాడు అంటూ నాగచైతన్య పై ట్రోల్ చేస్తున్నారు. తెలిసి తెలియక సురేష్ బాబు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news