Moviesఅతి చేస్తున్న శ్రీలీల..? స్టార్ హీరో స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

అతి చేస్తున్న శ్రీలీల..? స్టార్ హీరో స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . పెళ్లి సందడి అనే సినిమాతో సినీ తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. పాజిటివ్ కామెంట్స్ తోనే తన పేరుని పాపులర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంటర్ అవడంతో శ్రీలీలా అందాలు జనాలకు విపరీతంగా నచ్చేసాయి.

దానికి తగ్గట్టు అమ్మడు డాన్స్ ఇరగదీస్తుంది . ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే కళ్ళతో అవలీలగా నటించేస్తుంది . దీంతో ఒక్కసారిగా శ్రీలీల పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటివరకు ఆమె నటించిన సినిమా రిలీజ్ అయింది ఒక్కటంటే ఒక్కటే అది కూడా పాజిటివ్ హిట్, బ్లాక్ బస్టర్ కూడా కాలేదు. అయినా శ్రీలీల చేతిలో దాదాపు 6 ప్రాజెక్టులు ఉన్నాయి . త్వరలోనే రవితేజతో నటించిన ధమాకా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

అంతేకాదు మహేష్ బాబు -త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో రాబోతున్న SSMB28 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే అనిల్ రావిపూడి -బాలకృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఎన్.బి.కె 108 సినిమాలో శ్రీలీల అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. చేతుల్లో మరో ఐదులు బడా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తుంది . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో అమ్మడుకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ గా మారింది.

చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో అవకాశం ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక ఆల్రెడీ కమిట్ అయిన స్టార్ హీరో సినిమా నుండి తప్పుకోవడానికి సిద్ధపడిందట . ఇదే మాటను ఏకంగా డైరెక్టర్ కి కూడా చెప్పిందట. కొన్ని ఫామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది . డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పగా హీరోనే స్ట్రైట్ గా శ్రీలీలకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది . ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే ముందు పద్ధతిగా ఉండాలని మాట మీద నిలబడే తత్వం ఉంటేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని ..ఆమెను వార్న చేశాడట . అంతేకాదు నా సినిమా నుంచి తప్పుకునే ఛాన్స్ లేదు అగ్రిమెంట్ పై సైన్ చేసావ్ అంటూ లీగల్గా ప్రొసీడ్ అయ్యే విధంగా మాట్లాడినట్టు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే శ్రీలీల ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం బెటర్ అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news