మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అలవైకుంఠపురంలో సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి రెండున్నర సంవత్సరాలు దాటేసింది. వచ్చే సంక్రాంతి వస్తే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమా వచ్చి మూడేళ్లు కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమా పట్టాలు ఎక్కలేదు మధ్యలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో పట్టాలు ఎక్కాల్సిన సినిమా మధ్యలోనే అగిపోయింది. కారణాలు ఏవైనా ఎన్టీఆర్కు- త్రివిక్రమ్ కు ఎక్కడో తేడా రావడంతో ఎన్టీఆర్- కొరటాల శివకు కమిట్ అయిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు.
అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.. గత ఆరు నెలల నుంచి అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యి కూడా నెలలు గడిచిపోతున్న ఇంకా త్రివిక్రమ్ సినిమాపై ఎలాంటి అప్డేట్లు లేవు. రీసెంట్గా మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి చెందడంతో కాస్త గ్యాప్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లి వచ్చే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ కి జోడిగా మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహేష్ – పూజా కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అత్తారింటికి దారేది సినిమాలో సమంత- ప్రణీత, అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్- అను ఇమ్మానుయేల్, జల్సాలో ఇలియానా -పార్వతి మెల్టన్, అ..ఆ సినిమాలో సమంత- అనుపమ పరమేశ్వరన్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత- ఆదాశర్మ- నిత్య మీనన్ నటించారు.
ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ మహేష్ బాబు సినిమాలో సైతం ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకున్నారట. ఆమె తాజాగా విజయ్ దేవరకొండ డిజాస్టర్ లైగర్ లో హీరోయిన్ గా నటించింది.లైగర్ సినిమాలో అనన్య నటన చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆమెకు ఏమాత్రం నటన సరిగా రాదని కూడా విమర్శలు చేశారు.
ఇప్పుడు ఆ ఐరన్ లెగ్ బ్యూటీని మహేష్ బాబుకి జోడిగా ఎంపిక చేయడంతో మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్ కు దండాలు పెట్టేస్తున్నారు. నీకు అనన్య తప్ప మరే హీరోయిన్ కనిపించలేదా.. శ్రీలీలను పెట్టుకోవచ్చు కదా అని మహేష్ బాబు అభిమానులు సలహాలు ఇస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది.