Moviesబాలయ్య కోసం ఊహించని కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్.. ఎవరో...

బాలయ్య కోసం ఊహించని కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ వరుస‌ పెట్టి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అఖండ ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య వరుసగా మోత మోగించేస్తున్నారు. ఓవైపు వెండితెరపై టాప్ డైరెక్టర్‌ల‌తో సినిమాలు చేస్తూనే.. ఇటు బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన అన్‌స్టాపుల్ 2 ట్రైలర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 14న చంద్రబాబు- లోకేష్ ల ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండడంతో అందరిలోనూ ఈ ఎపిసోడ్ పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య తన తర్వాతి సినిమాను అనిల్ రావి పూడితో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మలినేని గోపీచంద్ సినిమాకు జై బాలయ్య అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు తీసుకువచ్చేందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 హోస్ట్ చేస్తున్న బాలయ్య మరోవైపు అనిల్ రావిపూడి సినిమాలో కూడా సమాంతరంగా నటించనున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండతో లైగర్ లాంటి డిజాస్టర్ సినిమా తెరకెక్కించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు బాలయ్య కోసం పవర్ఫుల్ కథ రెడీ చేసేసాడు. పూరి తన టీంతో కలిసి గోవాలో క్యాంప్‌ వేసుకుని మరి స్క్రిఫ్ట్‌పై కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య కోసం పూరి రెడీ చేసుకున్న కథలో భారీ డెప్త్ ఉందని తెలుస్తోంది. ఇది తండ్రి కొడుకుల కథ అని.. ఈ కథలో ఇద్దరు బాలయ్యలు నటిస్తారని.. తండ్రీకొడుకుల మధ్య మంచి ఎమోషనల్ టచ్ తో పాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

సినిమా అంతా ప్రధానంగా యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌లో ఉంటుందని… అందులో ఎమోషన్ కూడా మిక్స్ అయి ఉంటుందని తెలుస్తోంది. గతంలో పూరి ప్లాప్‌ల్లో ఉన్నప్పుడు బాలయ్య పూరి చెప్పిన పైసా వసూల్ కథ నమ్మి చేయగా ఆ సినిమా మరీ సూపర్ హిట్ కాకపోయినా బాలయ్యను వెండితెరపై సరికొత్తగా చూపించడంలో మాత్రం విజయం సాధించింది. ఆ సినిమాలో పూరి మేకింగ్ నచ్చి మరోసారి నీతో సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చారు.

ఇప్పుడు బాలయ్య ఆ మాట నిలబెట్టుకుంటున్నారని… అందుకే పూరితో మరోసారి చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. బాలయ్య కూడా పూరితో తాను మళ్ళీ ఓ సినిమా చేస్తానని కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సితార బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news