Moviesకృష్ణం రాజు అంత్యక్రియల్లో ప్రభాస్ చేసిన ఆ ఒక్క పనికి అంతా...

కృష్ణం రాజు అంత్యక్రియల్లో ప్రభాస్ చేసిన ఆ ఒక్క పనికి అంతా షాక్..ఏడ్చేసిన శ్యామలా దేవి..!!

టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ..ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఊహించని పరిణామంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ కృష్ణంరాజు మన మధ్య లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. తనదైన స్టైల్ లో నటిస్తూ కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న కృష్ణంరాజు అంటే సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ కే కాదు సామాన్య ప్రజలకు కూడా చాలా ఇష్టం.

మరీ ముఖ్యంగా రెబల్ హీరో ప్రభాస్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి పరిచయం చేసింది కృష్ణంరాజు నే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కృష్ణంరాజును బాగా ఆదరించేవారు . ఇలాంటి మంచి హీరోను ఇండస్ట్రీకి అందించినందుకు థాంక్స్ అంటూ చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతేకాదు కృష్ణం రాజు పలు సేవా కార్యక్రమాలు చేసి కూడా జనాలకు దగ్గరయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేసే తనదైన స్టైల్ లో రాజకీయం చేసిన ఘనత కృష్ణంరాజుకే దక్కింది.

కాగా గత నెల రోజుల నుంచి పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆయన అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు కనక మామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించారు కుటుంబ సభ్యులు . ఆయన అంతక్రియలకు సినీ ప్రముఖులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు రెబెల్ ఫ్యామిలీ .

అయితే కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రభాస్ చేసిన పనికి అంత షాక్ అయ్యారు. కృష్ణం రాజు చితికి నిప్పు పెట్టే టైంలో ప్రభాస్ ని పిలుస్తారు అక్కడ ఉండేవాళ్లు. అయితే ఈ టైంలో ప్రభాస్ వస్తూ చెప్పులు కూడా వేసుకోవడం మర్చిపోతాడు. కన్నీటి పర్యంతం అయిపోతాడు చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు. ఈ దృశ్యాలు చూసిన అందరూ ప్రభాస్ ని ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు శ్యామలాదేవి ఆయన ఆయన పాడె మోయడం మరింత ఎమోషనల్ అనిపిస్తుంది. ఆ టైంలో ప్రతి మహిళ ప్రతి అభిమాని ఆమెకు కృష్ణంరాజు అంటే ఎంత ప్రేమ అని చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఏది ఏమైనా కృష్ణంరాజు ఇక మన మధ్య లేడు అనేది అంత ఈజీగా మర్చిపోలేం కచ్చితంగా టైం పడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news