సదా.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. యంగ్ హీరో నితిన్ నటించిన జయం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ క్యూట్ లుక్స్ తో తెలిసి తెలియని అమాయకపు ముఖంతో.. ” వెళ్లవయ్య వెళ్ళు” అంటూ కుర్రాలను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సదా.. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. కానీ చెప్పుకో తగ్గ హిట్ మాత్రం అందుకోలేదు. అప్పుడే ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మల్టీ టాలెంటెడ్ విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మళ్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తర్వాత సదా పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు అంత. కానీ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీ నుండే తప్పుకునేసింది . ఈ సినిమా తర్వాత బోలెడు అవకాశాలు వచ్చినా సదా వాటిని ఎందుకో ఉపయోగించుకోలేకపోయింది . తెలిసి తెలియని తనంతో తప్పుడు కథలను చూసి చేసుకొని కెరీర్ కు బిగ్గెస్ట్ మైనస్ గా మార్చుకుంది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సదా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్లో ఫస్ట్ టైం ఓ వేశ్య పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పి అందరికీ
షాకిచ్చింది.
మనకు తెలిసిందే సదా టార్చ్ లైట్ అనే తమిళ సినిమాలో ఓ వేశ్య పాత్ర చేసింది. అదే సినిమాను తెలుగులో శ్రీమతి 21 గా అనువాదించారు. ఈ సినిమాలో సదా ఓ వేశ్య పాత్రలో కనిపించింది. సినిమాలో కంటెంట్ ఉన్న సదా నటనలో ఎమోషన్స్ ఉన్న ఎందుకో తెలియదు ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది . ఈ సినిమా తర్వాత సదా అడ్రస్ లేకుండా పోయింది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సదా మాట్లాడుతూ.. ఈ సినిమాలో వేశ్య పాత్ర చేయడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది.
” నిజానికి శ్రీమతి 21ఎఫ్ సినిమా టైంలో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. అప్పుడు నా పొజిషన్ వేరు. సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు పరిస్థితులు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఉంటాయని నేను నమ్మాను. కానీ అలా జరగలేదు. నా కెరియర్ సగం లోనే ఫ్లాప్ గా మిగిలింది. నా కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న ఇమేజ్ నేను శ్రీమతి 21ఎఫ్ సినిమా చేసే టైంలో నాకు లేదు. కాబట్టి ఇలాంటి చాలెంజింగ్ రోల్ చేయాలని ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యి ఇలాంటి వేశ్య పాత్ర చేశాను. సినిమా కధ వినగానే బాగా కనెక్ట్ అయిపోయా..నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయా. అందుకే వెంటనే సైన్ చేసేశాను. నిజానికి ఈ పాత్ర చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డ. కానీ ఆ పాత్రలోని నిజాయితీ నాకు నచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా నా నటన చూసి అందరూ మెచ్చుకున్నారు అది చాలు నాకు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.