Moviesఇంట్రెస్టింగ్: తెలిసి తెలిసి అదే తప్పు తారక్ మళ్ళీ చేస్తాడా..!?

ఇంట్రెస్టింగ్: తెలిసి తెలిసి అదే తప్పు తారక్ మళ్ళీ చేస్తాడా..!?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరు ఫుల్ ఫిల్ చేయలేరు. ఆయన స్టైల్.. ఆయన డైలాగ్ డెలివరీ.. ఆయన లుక్స్.. ఆయనకే సొంతం. సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నా ఎందుకో తెలియదు కానీ తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది జనాలకి. రీసెంట్ గా ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తారక్ ప్రజెంట్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 సినిమాను.. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు.

అయితే ఈ రెండు సినిమాలు అఫీషియల్ గా ఈ మధ్యనే ప్రకటించాడు తారక్ . ఇవి కాకుండా తారక్ ఖాతాలో ఇంకా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయట. ఒకటి బుచ్చిబాబు సనా తో సినిమా తీయబోతున్నాడంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇది కాకుండా అనిల్ రావిపూడి తో ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు తారక్ అంటూ ఓ వార్త సినీ వర్గాలు తెగ హల్ చల్ చేస్తుంది. ఇదంతా కాకుండా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూస్ రీడర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన వక్కంతం వంశీ.. సినీ ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా దర్శకుడిగా.. మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

నిజానికి యంగ్ టైగర్.. వంశీ వక్కంతం కు మంచి రిలేషన్ షిప్ ఉంది. గతంలో తారక్ నటించిన అశోక్ సినిమా , ఊసరవెల్లి సినిమా, టెంపర్ సినిమాలకు.. కధ అందించింది వక్కంతం వంశీనే. వీటిల్లో అశోక్.. ఊసరవెల్లి పర్లేదు అనిపించినా.. టెంపర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఆ టైంలో వంశీ తారక్ ను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడట. ఆ కోరిక ఇన్నాళ్లకు నెవేరబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తో సినిమా కంప్లీట్ అయిన తర్వాత వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

అయితే ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్ కు తారక్ ఛాన్స్ ఇవ్వడం నందమూరి అభిమానులకు నచ్చడం లేదు. ఇప్పటివరకు తన ఖాతాలో ఒక్క హిట్టు పడని వక్కంతం వంశీ డైరెక్షన్ లో తారక్ సినిమా చేయడం ప్రమాదం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి తారక్ తెలిసి తెలిసి ఆ తప్పు ఎలా చేస్తాడా అన్నేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది..? తారక్ మరి తెలిసి తెలిసి ఆ తప్పు చేస్తాడంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news