జబర్ధస్త్ గా ఉండే ఒకప్పటి జబర్ధస్త్ యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం..నటనకి నటన..ఇద్దరు పిల్లలు ఉన్నా చెక్కు చెదరని అందం..టాలెంట్..దానికి మించిన పొగరు..దానే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు అంతా. ఇలా ఈ విధమైన బిహేవీయర్ తో ఉన్నది ఉన్నట్లు మాట్లాడి..అనసూయ ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ షోని వదిలేసుకున్న అనసూయా..ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేసింది.
జబర్ధస్త్ నుండి తప్పుకోవడానికి కారణాలు చెప్పుతూ..బాడీ షేమింగ్ కామెంట్లు నచ్చకనే షో నుండి తప్పుకున్నాను అని పరోక్షంగా చెప్పిన ఈ బ్యూటీ..తన వ్యక్తిగత జీవితం పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను బ్రాహ్మణ అమ్మాయిని..ఇండస్ట్రీలోకి వెళ్తుంటే అందరు విచిత్రంగా చూసేవారని చెప్పుకొచ్చిన అనసూయ.. చచ్చినా కానీ తప్పుడు పనులు చేయను అంటూ ముఖానే చెప్పేసింది. తాను ఎంచుకున్న దారి కంఫర్ట్ ఇచ్చిందని..చెప్పుకొచ్చిన అనసూయా.. కొన్నిసార్లు ఇబ్బందులు పడినా.. నచ్చకపోయినా కానీ.. నా ఇష్టం గానే కొనసాగాను అంటూ క్లారిటీ ఇచ్చింది.
సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయినని.. భయపడుతూనే టీవీ ఇండస్ట్రీకి వచ్చానని..నేను ఈ ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నాను అంటేనే ..చాలా మంది వామ్మో ముఖానికి మేకప్ వేసుకుంటావా? అందరి ముందు అలాంటి బట్టలు వేసుకుని కెమెరాను ఫేస్ చేస్తావా ? అనేవారు అని..కానీ అవి ఏం పట్టించుకోకుండా.. ధైర్యం గా ఈ ఫీల్డ్ లోకి వచ్చానని..మొదట్లో బాగున్న ఈ టీవి ఇండస్ట్రీ ఇప్పుడు కలుషితం అయిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసే ఏ ఒక్క సందర్భం వచ్చినా సరే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతానని పరోక్షంగా జబర్ధస్త్ నుండి బయటకు రావడానికి కారణం ను బయటపెట్టింది.