Movies' కార్తికేయ 2 ' ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్.. బాక్సాఫీస్ అరాచ‌కం...

‘ కార్తికేయ 2 ‘ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్.. బాక్సాఫీస్ అరాచ‌కం ఇదే..!

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన సినిమా కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 గత రెండు నెలలుగా రిలీజ్ డేట్ ప్రకటించిన కూడా వాయిదాల పడుతూ వస్తోంది. గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. టాలీవుడ్‌కు షాకిస్తూ కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవటం ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్ కు గురిచేసింది. విచిత్ర ఏమిటంటే శనివారం కన్నా ఆదివారం ..రెండో రోజు కన్నా మూడో రోజు మంచి కలెక్షన్లు నమోదు చేసింది.

ఈ సినిమాకు పోటీగా వచ్చిన నితిన్ మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కావటం కార్తికేయ 2కు బాగా కలిసి వచ్చింది. చాలాచోట్ల నితిన్ సినిమాను థియేటర్లలో నుంచి తీసివేసి అక్కడ కూడా కార్తికేయ 2 సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏరియా వైస్ వసూళ్లు చూస్తే ఆంధ్రాలో అన్ని ఏరియల్ కలిపి రు. 6 కోట్లకు విక్రయించారు. తొలి మూడు రోజుల్లో జీఎస్టీ లేకుండానే 5.65 కోట్లు వచ్చింది. అలాగే నైజాంలో 4 కోట్లు అడ్వాన్స్ మీద విడుదల చేస్తే… అక్కడ కూడా మూడు రోజులకే 3.88 కోట్లు వచ్చింది.

ఇక సీడెడ్‌లో రు. 2 కోట్ల అడ్వాన్స్ మీద రిలీజ్ చేస్తే అక్కడ కూడా జీఎస్టీ కలపకుండా 1. 88 కోట్లు వచ్చింది. అంటే దాదాపు సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక అడ్వాన్సులు… నాన్ వెరిర్నబుల్ అడ్వాన్స్ ల మీద సినిమా విడుదల చేయడంతో నిర్మాతలకు మంచి ఓవర్ ప్లోస్‌ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిందీ బెల్ట్‌తో పాటు ఓవర్సీస్, తెలుగు ఏరియాల‌ నుంచి ఈ సినిమాకు మంచి లాభాలు రానున్నాయి.

ఓవరాల్ వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి కార్తికేయటు 2కు రు. 28 కోట్లు ఖర్చయింది. ఇక ఇప్ప‌టి నుంచి అన్ని భారీ లాభాలు ఈ సినిమా సొంతం కానున్నాయి. ఏదేమైనా ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిఖిల్ అరాచ‌కం అని చెప్పాలి. క‌ళ్యాణ్‌రామ్ బింబిసార సినిమా మూడు రోజుల‌కే ఎలా బ్రేక్ ఈవెన్ అయ్యిందో ఇప్పుడు నిఖిల్ కార్తీకేయ 2కూడా అలాగే మూడు రోజుల‌కే బ్రేక్ ఈవెన్ అయ్యి సంచ‌ల‌నం న‌మోదు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news