సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. బడా బడా ఫ్యామిలీ ల నుండి వస్తున్న పిల్లలు కూడా సినీ ఇండస్ట్రీలో నెట్టుకు రాలేకపోతున్నారు. ఫారిన్ స్కూల్స్ లో నటన పై శిక్షణ తీసుకుని వచ్చినా తెలుగు ఇండస్ట్రీలో ఆకట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు ఎన్నైనా కానీ..అంతో ఇంతో డైరెక్టర్లు కూడా కారణం అంటూ ఇప్పుడు చిరంజీవి మాటలకు బట్టి అర్ధమవుతుంది. మనకు తెలిసిందే చిరంజీవి ఎవ్వరిని నొప్పించరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. కానీ, సహనం కోల్పోతేనే ఇలా టంగ్ కి పనులు చెప్పుతారు.
సినీ ఇండస్ట్రీలో మేము పెద్ద అని చెప్పుకునే కొన్ని ఫ్యామిలీలు అస్సలి ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నా పట్టించుకోవు. వాళ్లది అంతా కమర్షీయల్ మైండ్ అంటారు జనాలు. అంతో ఇంతో చిరు నే పట్టించుకోవాలే కానీ..సో కాల్ పెద్ద మనుషులు రారు. వచ్చి సమస్యని పరిష్కరించుకోవడం అలా పక్కన పెడితే..డబుల్ చేసిపోతారు. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అందరు స్క్రిప్ట్ పై పక్క ప్లానింగ్ తో ఉందట్లేదు అని చిరంజీవి మాటలను బట్టే అర్ధమవుతుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేసిన చిరంజీవి మాట్లాదుతూ టాలీవుడ్ దర్శకులకు గట్టి క్లాస్ పీకారు. వాళ్లను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్ నటన గురించి ఎంతో గొప్పగా చెప్పుతూ..మాకు అలానే చేయాలని ఉంటుందని..కానీ, డైరెక్టర్స్ పెట్టే పరిధుల వల్ల తాము చేయలేకపోతున్నామని చిరు చెప్పడం సంచలనంగా మారింది.
అంతే కాదు ఆయన మాట్లాడుతూ..”ఇండస్టృఈ లో కొందరు డైరెక్టర్లు స్క్రిప్ట్ పై సరైన వర్క్ చేయడం లేదు. అప్పటికప్పుడు షూటింగ్ స్పాట్‌లో కి వచ్చి డైలాగ్‌లు రాసి ఇస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రాక్టీస్ చేయాలి. సోస్, మీరు ముందే రాసి ఇస్తే..మేము ప్రాక్టీస్ చేసుకుని..షూట్ అప్పుడు కేవలం నటన పై మాత్రమే ఫోకస్ చేస్తాం..అప్పటికప్పుడు రాసి ఇస్తే ఎలా..అందరు గుర్తు పెట్టుకోలేరు..అప్పడు సీన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది నటులను చాలా ఇబ్బంది పెడుతోంది. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది. అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో అంతగా ఇన్వాల్వ్‌మెంట్ అంతంతమాత్రంగానే ఉంటుంది..”అంటూ చిరంజీవి గట్టి క్లాస్ పీకారు. మరి చూడాలి ఇక నైన డైరెక్టర్స్ మారుతారా.లేదా అనేది..?