దివంగత ఆర్తీ అగర్వాల్ కెరీర్ చాలా తక్కువ టైంలోనే విషాదంగా ముగిసింది. టాలీవుడ్లో రెండు దశాబ్దాల క్రిందట అర్తీ అగర్వాల్ తెలుగు సినీ విలాకాసంలో ఓ అందగత్తె. ఆమెను చూసేందుకు యూత్ వెంపర్లాడిపోయేవారు. ఆమె సినిమా వస్తుందంటే చాలు ఆమెను చూసేందుకే థియేటర్లకు వెళ్లిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వెంకటేష్ నువ్వునాకు నచ్చావ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎంట్రీ ఇచ్చింది. అసలు మూడేళ్ల పాటు ఆమె క్షణం తీరిక లేనంత బిజీగా సినిమాలు చేసింది.
అప్పటి కుర్ర హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చకచకా చేసేసింది. చిరంజీవి, నాగ్, వెంకీ, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు, తరుణ్, ఉదయ్‌కిరణ్, ప్రభాస్ ఇలా అందరి సినిమాల్లోనూ చేసేసింది. 2001 నుంచి 2004 వరకు ఆమె ఇండస్ట్రీని ఊపేసింది. చాలా తక్కువ టైంలో సూపర్ హిట్లు పడ్డాయి. ఆ తర్వాత తరుణ్‌తో ప్రేమాయణం అంటూ వచ్చిన వార్తలు, శరీరాకృతిలో మార్పులతో లావెక్కి ఫేడవుట్ అవ్వడం.. చివరకు వివాహం.. విడాకులు.. ఆపరేషన్ వికటించి ఆమె మృతిచెందడం జరిగిపోయింది.
ఆమె కెరీర్ నాశనం అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నా ఆమె తండ్రి నిర్ణయాలు కూడా అని నిర్మాతలే చెప్పేవారు. సెట్లో ఆర్తీ తండ్రి ఉంటే కొన్ని సీన్లకు అభ్యంతరాలు చెప్పేవాడట. అప్పుడు ఆమె కూడా బిడియంగానే సీన్లలో నటించేది అట. అదే సెట్లో ఆమె తల్లిదండ్రులు లేకపోతే ఆమె అంత కంఫర్ట్ హీరోయిన్ ఎవ్వరూ ఉండరని ఆమెతో రెండు సినిమాలు చేసిన నిర్మాత చంటి అడ్డాల చెప్పారు.
ఓ సారి అల్లరి రాముడు షూటింగ్ టైంలో తలకోన అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె వర్షంలో తడవడంతో 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతోందట. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో ఏ హీరోయిన్ అయినా షూటింగ్ చేయలేదు. ఆమెకు విపరీతమైన బాడీ ఫెయిన్స్ కూడా ఉన్నాయట. ఆమె ఒక్క రోజు షూటింగ్‌కు రాకపోతే ఎన్టీఆర్ డేట్లు వేస్ట్ అవుతాయి.. ఓ వైపు డైరెక్టర్ బి. గోపాల్ అదే టైంలో అల్లరి రాముడు, ఇంద్ర రెండు సినిమాలను షూట్ చేస్తున్నారు. ఆయన డేట్లు కూడా బిజీ.
అయితే ఆర్తీ అగర్వాల్ తన కోసం ఎన్టీఆర్, గోపాల్‌తో పాటు షూటింగ్ టీం ఇబ్బంది పడకూడదని ట్యాబ్లెట్లు వేసుకుని మరీ ఆ రోజు షూటింగ్ చేసిందట. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత చంటి అడ్డాలే చెప్పారు. ఆమె కమిట్మెంట్ నచ్చే ఆయన ప్రభాస్‌తో తీసిన అడవి రాముడు సినిమాలోనూ ఆమెనే హీరోయిన్గా పెట్టుకున్నారు.