ఔను.. ఎన్టీఆర్ మాట విని ఉంటే… రాజనాల ఏమయ్యేవారు? చివరి దశలో ఎంత బాగా జీవించి ఉండేవా రు? ఇది ఒక్క రాజనాల గురించే కాదు.. అనేక మంది సినీ నటుల జీవితంలో ఎదురైన ప్రశ్న. దీనికి కారణం.. అన్నగారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా.. అనేక మంది సినీ నటులతో అవినాభావ సంబంధం ఉంది. వీరిలో శోభన్‌బాబు, మాగంటి మురళీమోహన్, మోహన్‌బాబు.. రాజనాల, శారద, రామా నాయుడు.. రాజనాల.. ఎంతో మంది ఉన్నారు.
వీరిని ఎన్టీఆర్ తాను పార్టీ పెట్టినప్పుడు.. అండగా ఉండాలని కోరారు. అయితే.. వీరిలో చాలా మంది తిరస్కరించారు. సినిమాల్లో ఉన్నవారు.. రాజకీయాల్లోకి వస్తే.. విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని.. తొలి దశలోనే చాలా మంది అన్నగారి వెంట నడిచేందుకు ముందుకు రాలేదు. ముఖ్యంగా వీరిలో శోభన్‌బాబు అస్సలు.. అన్నగారి రాజకీయ ప్రవేశాన్నే ఇష్టపడలేదు. ఇక, రాజనాల కూడా రాజకీయాల్లోకిరాలేనని చెప్పారు. అయితే.. ఎన్టీఆర్ ఎవరినీ ఒత్తిడి చేయలేదు.
కానీ, తర్వాత కాలంలో మాత్రం మోహన్‌బాబు టీడీపీకి చేరువయ్యారు. కానీ అప్పటికే అన్నగారు.. రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, మాగంటి మురళీ మోహన్ మాత్రం ప్రచారం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ, రాజనాల అసలు ప్రచారానికి కూడా రాలేదు. దీంతో ఆయన సినీ రంగం ముగిసిన తర్వాత.. ఇదే విషయాన్ని మీడియాకు చెప్పుకొచ్చారు. ఆనాడు అన్నగారు చెప్పినట్టు విని ఉంటే.. రాజకీయాల్లో స్థిరపడే అవకాశం వచ్చి ఉండేదని అన్నారు.
రాజకీయాల్లోకి రాకపోగా.. అన్నగారు సూచించినట్టు ఆర్థికంగానూ.. రాజనాల స్థిర పడలేక పోయారు. ఆర్థిక క్రమ శిక్షణకు అన్నగారు. పెట్టింది పేరు. ఈ విషయంలో అక్కినేని నాగేశ్వరరావుఅన్నగారినే ఫాలో అయ్యారు. దీంతో స్టూడియోలు కట్టుకున్నారు.
రాజనాల ఆపని కూడా చేయలేక పోయారు. దీంతో చివరి దశలో ఆయన దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ఆయన చనిపోయే వరకు బాధపడాల్సి వచ్చిందని సినీ రంగంలో ఇప్పటికీ చెప్పుకొంటారు.