Moviesమ‌హేష్ స్ట్రాంగ్ లైన‌ప్‌లో 5 గురు టాప్ డైరెక్ట‌ర్లు... ఏం క్రేజీ...

మ‌హేష్ స్ట్రాంగ్ లైన‌ప్‌లో 5 గురు టాప్ డైరెక్ట‌ర్లు… ఏం క్రేజీ ప్రాజెక్టులు రా బాబు..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా భారీ అంచ‌నాలు అయితే అందుకోలేదు. భారీ రేట్ల‌కు అంటే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన స‌ర్కారు వారి పాట‌కు క్లోజింగ్ క‌లెక్ష‌న్లు రు. 110 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా చూస్తే రు. 10 కోట్ల వ‌ర‌కు ఈ సినిమాకు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు – స‌ర్కారు వారి పాట సినిమాలో మాంచి జోష్‌లో ఉన్న మ‌హేష్ త‌న నెక్ట్స్ లైన‌ప్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మ‌హేష్ నెక్ట్స్ లైన‌ప్ చూస్తుంటూనే గూస్ బంప్స్ వ‌చ్చేసేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాను భారీ పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. అటు త్రివిక్ర‌మ్ కూడా గ‌తంలో మ‌హేష్ అత‌డు, ఖ‌లేజా సినిమాలు చేసినా అవి రెండు క‌మర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. దీంతో ఈ సారి మ‌హేష్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇవ్వాల‌ని క‌సితో ఉన్నాడు.

త్రివిక్ర‌మ్ సినిమా పూర్త‌యిన వెంట‌నే రెండు ద‌శాబ్దాలుగా అంద‌రూ వెయిట్ చేస్తోన్న క్రేజీ ప్రెస్టేజియ‌స్ మూవీ మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

రాజ‌మౌళి సినిమా షూటింగ్ దాదాపు యేడాది పాటు ఉంటుంది. ఈ లోగా బ‌న్నీతో పుష్ప ది రైజ్ షూటింగ్ పూర్తి చేసే సుకుమార్ మ‌హేష్ సినిమా క‌థ మీద కూర్చుంటాడు. రాజ‌మౌళి త‌ర్వాత మ‌హేష్ చేసే సినిమా సుకుమార్‌దే. గ‌తంలో మ‌హేష్ – సుక్కు కాంబోలో వ‌న్ నేనొక్క‌డినే సినిమా వ‌చ్చింది. సినిమాకు ప్ర‌శంస‌లు వ‌చ్చినా సుకుమార్ టిఫిక‌ల్ స్క్రీన్ ప్లే జ‌నాల‌కు క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో సినిమా ఆడ‌లేదు. దీంతో సుక్కు కూడా ఈ సారి మ‌హేష్‌కు హిట్ ఇవ్వాల‌న్న క‌సితోనే ఉన్నాడు.

సుకుమార్ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ సందీప్‌రెడ్డి వంగ సినిమా ఉంటుంది. ఈ లోగా సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా కంప్లీట్ చేసి.. అనంత‌రం మ‌హేష్ సినిమా క‌థ‌పై వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ నాలుగు సినిమాల త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌కు ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. పూరి కూడా మ‌హేష్ కోసం ఎప్ప‌టి నుంచో వెయిటింగ్‌లో ఉన్నాడు. పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి హిట్ల త‌ర్వాత పూరి మ‌హేష్ సినిమా కోసం ట్రై చేస్తున్నా సెట్ కావ‌ట్లేదు. ఏదేమైనా మ‌హేష్ నెక్ట్స్ 5 సినిమాల లైన‌ప్ అయితే చాలా స్ట్రాంగ్‌గానే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news