Healthశృంగారం స‌మ‌యంలో మ‌హిళ‌లు చేసే త‌ప్పులు ఇవే.. జ‌ర జాగ్ర‌త్త‌..!

శృంగారం స‌మ‌యంలో మ‌హిళ‌లు చేసే త‌ప్పులు ఇవే.. జ‌ర జాగ్ర‌త్త‌..!

శృంగారాన్ని అస్వాదించాల‌న్న కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే దీని గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు మాత్రం చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎవ‌రెలా ఉన్నా శృంగారం విష‌యంలో న‌లుగురిలో మాట్లాడే విష‌యంలో మ‌హిళ‌ల‌కే కాస్త బీడియం ఎక్కువుగా ఉంటుంది. మ‌హిళ‌లు శృంగారం విష‌యంలో తెలిసో తెలియ‌క చాలా త‌ప్పులు చేస్తూ ఉంటారు. శృంగారం విష‌యంలో మ‌హిళలు అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని త‌ప్పులేంటో ఓ సారి చూద్దాం.

శృంగారం చేసేట‌ప్పుడు ఎవ‌రు అయినా త‌మ‌కు ఏది న‌చ్చుతుంది.. ఏది న‌చ్చ‌దు అనే విష‌యాన్ని త‌మ భాగ‌స్వామికి చెప్పాల‌ట‌. అయితే మ‌హిళలు త‌మ భాగ‌స్వామికి మాత్రం త‌మ‌కు ఏది న‌చ్చుతుందో ? ఏది న‌చ్చ‌దో ? అన్న విష‌యం ముందుగా చెప్ప‌డం లేద‌ట‌. వాస్త‌వంగా నిజం అనేది ముందుగానే త‌మ భాగ‌స్వామికి చెపితే పురుషులు కూడా మీ ఇష్టాఇష్టాలు తెలుసుకుని మీతో ఎంజాయ్ చేసే స్పేస్ దొరుకుతుంద‌ట‌.

ఆడ‌వాళ్లు సిగ్గుప‌డితే అందంగా ఉంటుంది. అయితే అన్ని విష‌యాల్లోనూ సిగ్గుప‌డుతూ అన్ని విష‌యాలు లోప‌లే దాచేసుకుంటే కొన్నిసార్లు అది అపార్థాల‌కు దారితీసి.. బంధం మ‌ధ్య బీట‌లు వేస్తుంద‌ట‌. ముఖ్యంగా శృంగారం విష‌యంలో స్త్రీలు అస్స‌లు సిగ్గుప‌డ‌కూడ‌ద‌ట‌. ఈ విష‌యంలో స్త్రీలే ముందుగా చొర‌వ తీసుకుంటే బాగుంటుంద‌ని పురుషులు కోరుకుంటార‌ట‌. స్త్రీల యెక్క మ‌న‌స్తత్వం అంద‌రు పురుషులు చ‌ద‌వ‌లేరు.. అందుకే ముందుగా స్త్రీలు తాము ఏం కోరుకుంటున్నామో పురుషుల‌కు చెపితే బాగుంటుంద‌ట‌.

ఇక చాలా మంది పురుషులు పిల్ల‌లు పుట్టాక త‌మ షేప్ అవుట్ అయిపోయింద‌ని.. తాము త‌మ భ‌ర్త‌కు న‌చ్చ‌మ‌ని త‌మ‌లో తామే మ‌నోవేద‌న‌కు గుర‌వుతూ ఉంటార‌ట‌. తాము లావు అయిపోవడంతో త‌మ భ‌ర్త‌కు త‌మ ప‌ట్ల ఇష్టం లేద‌ని.. ఇత‌ర‌త్రా ఆక‌ర్ష‌ణ‌ల‌కు లోన‌వుతున్నాడా ? అంటూ ర‌క‌ర‌కాలుగా మ‌ద‌న‌ప‌డిపోతుంటార‌ట‌. అయితే అటు త‌మ భ‌ర్త‌ల వ‌య‌స్సు కూడా పెరుగుతుంద‌ని.. వారి ఆకృతి, సామ‌ర్థ్యాల్లో మార్పు వ‌స్తుంద‌న్న‌ది మాత్రం మ‌హిళ‌లు గుర్తించ‌ర‌ట‌.

ఇక శృంగారం మ‌ధ్య‌లో భ‌ర్తల మూడ్ పోగొట్టేలా ప్ర‌వ‌ర్తించ‌డం.. వాళ్ల మూడ్ పోగొట్టే మాట‌లు మాట్లాడ‌డం చేయడం వ‌ల్ల పురుషుల మూడ్ మొత్తం పోతుంద‌ట‌. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనా శృంగారం విష‌యంలో మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల విష‌యంలో చాలా ఓపెన్‌గా ఉంటే అభిప్రాయ బేధాలు రావంటున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news