Moviesబాలయ్యతో ఫోటో అంటే అట్లుంటది మరి..టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..!!

బాలయ్యతో ఫోటో అంటే అట్లుంటది మరి..టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..!!

నందమూరి నట సింహం బాలకృష్ణ..ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. తప్పు చేస్తే అరవడం..మంచి పని చేస్తే అప్రిషీయేట్ చేయడం నందమూరి నట వంశ హీరోలకి అలవాటు. జనరల్ గా బాలయ్య అనగానే అందరికి గుర్తు వచ్చేది తొడ కొట్టడాలు, మీసాలు మెలివేయడాలు..భారీ భారీ డైలాగ్ లు చెప్పడాలు, కత్తులతో నరకడాలు..ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ నే గుర్తు తెచ్చుకుంటారు.

 

కానీ, బాలయ్య లో ఉన్న కామెడీ టైమింగ్ ని, మంచి మనసుని..కేవలం కొందరే చూడగలరు. ఆయనని అర్ధం చేసుకునే వాళ్లకే బాలయ్య ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం క్రియేట్ చేసేస్తారు. నేను సెలబ్రిటీని..నా రేంజ్ ఇది..అంటూ విర్రవీగరు..మీలో ఒకడిని నేను..నా జనాలు అంటూ అప్యాయతగా పలకరిస్తారు. ఎక్కడికైన వెళ్ళినప్పుడు ఫోటో అడిగితే..సెక్యూరిటీకి చెప్పి గెంటించేయడు.

దగ్గరకు పిలిచి..ఆయనే ఫోటో తీస్తారు. ఇలాంటి సంధర్భాలు మనం చాలానే చూశాం. ఇక ప్రజెంట్ సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. రీసెంట్ గా హిందూపురంలోని ఒక కార్యకర్త నూతన గృహప్రవేశ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా వెళ్ళారు. అక్కడ అందరు బాలయ్య ను బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఇక అక్కడే ఉన్న ఆయన అభిమానులు బాలయ్యతో ఫోటో దిగుతున్నాడు. కాగా బాలయ్య పక్కనే ఉన్న అభిమాని ఓ పాపను ఎత్తుకుని..బాలయ్య తో ఫోటో కోసం వచ్చాడు. ఆ పాప పడుకుని ఉండటం తో బాలయ్య తన చేతితో తట్టిమరీ..ఏయ్ లేవూ..అంటూ ఫోటో వైపు చూడమని..చెప్పడం ..దీంతో ఆ పాప కూయ్ మనకుండా ఫోటో వైపు చూడటం..కాసేపు అక్కడ నవ్వులు పూయించింది. అది బాలయ్య ప్రేమ అని…ఆ పాప జీవితాంతం గుర్తు పెట్టుకునే సన్నివేశం అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by SARCASM (@sarcastc_us2.0)

Latest news