MoviesNTR 31: టైటిల్ & క్యారెక్టర్‌కి ఆ సినిమా ఇన్స్పిరేషనా..?

NTR 31: టైటిల్ & క్యారెక్టర్‌కి ఆ సినిమా ఇన్స్పిరేషనా..?

కొందరు దర్శకులు వాస్తవ సంఘటన ఆధారంగా కథను అందులోని హీరో పాత్రను రాసుకుంటారు. కొందరు నవల ఆధారంగా సినిమా కోసం కథ రాసుకుంటారు. కొందరు నిజజీవిత కథలను (అంటే ప్రస్తుతం నడుస్తున్న బయోపిక్స్ ట్రెండ్) సినిమాకు కథా వస్తువుగా తీసుకుంటారు. ఇక మరికొంతమంది పాత సినిమాలలో హీరో పాత్రను లేదా టైటిల్‌ను తీసుకొని ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో ఇమేజ్‌కు సరిపోయోలా కథ కథనాన్ని, దానిలో హీరోయిజాన్ని రాసుకొని సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ కొడుతుంటారు.

ఇటీవల ప్రకటించిన ఎన్.టి.ఆర్ 31కి కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకున్న కథ, అందులోని పాత్ర, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైటిల్ ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేసి హిట్ అందుకున్న జై లవ కుశ సినిమా ఇన్స్పిరేషన్ అని తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో జై లవ కుశ పాత్రల్లో ఎన్.టి.ఆర్ నటించారు.

మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన తారక్..ఈ మూడు పాత్రలలో కంటే కూడా నెగిటివ్ రోల్ పోషించిన రావణ్ పాత్ర తెరమీద చూస్తున్న ఆడియన్స్‌ను ఒణికిస్తుంది. నత్తితో, కౄరత్వాన్ని ప్రదర్శించి తనకు తనే సాటి అనిపించారు. ఈ పాత్రలో నటించడానికి ఎన్.టి.ఆర్ తనకు తానే కొత్త ఆలోచనతో కొత్త మోడ్యులేషన్‌తో ప్రిపేర్ అయ్యారు. మూడు పాత్రల్లో బాగా హైలెట్ అయింది రావణ్ పాత్రే.

ఇలాంటి పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతే ఆడియన్స్ కంట నీరు వచ్చిందే గానీ నెగిటివ్ రోల్ కదా అని తిట్టుకోలేదు. అంటే అదే హీరోయిజం అని భావించారు. అంత ఇంపాక్ట్ రావణ్ పాత్రలో ఉంటుంది. ఈ పాత్రను పరిచయం చేసినప్పుడే ‘అసుర’ అంటూ పాత్ర స్వభాన్ని తెలియజేస్తూ పాట వస్తుంది. ఇప్పుడు ఎన్.టి.ఆర్ 31కి చిత్రబృందం ఇదే ‘అసుర’ అనే టైటిల్‌ను పెట్టాలని ఆలోచిస్తున్నారట. వాస్తవంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పుడో 20 ఏళ క్రితం ఈ లైన్ అనుకున్నారట.

కానీ, దాన్ని తారక్‌తో చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తెలియకుండానే రావణ్ పాత్రను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఎన్.టి.ఆర్ 31 ఫస్ట్ లుక్ చూస్తే ఖచ్చితంగా జై లవ కుశ సినిమాలో రావణ్ పాత్ర గుర్తుస్తొంది. అంటే ఈ సినిమాలో తారక్ పాత్ర కూడా ఇంచుమించి ఆ తరహాలోనే ఉంటుందని అర్థమవుతోంది. చూడాలి మరి ఇది నిజమా కాదా..రానున్న రోజుల్లో మేకర్స్ ఇచ్చే అప్‌డేట్స్‌తో క్లారిటీ వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news