Moviesఒకే సినిమాలో 5 పాత్ర‌లు.. సీనియ‌ర్ ఎన్టీఆర్ సృష్టించిన ఈ రికార్డ్...

ఒకే సినిమాలో 5 పాత్ర‌లు.. సీనియ‌ర్ ఎన్టీఆర్ సృష్టించిన ఈ రికార్డ్ గురించి మీకు తెలుసా..?

తెలుగు వారంతా గర్వంగా మా వాడు అని చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి శ‌త‌జ‌యంతి తాజాగా అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రూ కూడా పార్టీలు, కులాలు, మ‌తాల‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్నారు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయ‌న్ను స్మరించుకుంటూ సినీ ప్రిముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు ఎమోషనల్ పోస్ట్‌ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేశారు. ఎన్టీఆర్‌ సినీ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. 1949లో `మనదేశం` మూవీతో తొలిసారి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్ అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని.. మిగిలిన హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు.

33 ఏళ్ల సినీ కెరీర్‌లో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. మ‌రెన్నో రికార్డుల‌ను నెల‌కొల్పారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యంతో పాటు పంచ పాత్రాభినయం చేసిన ఏకైనా హీరోగా అప్పట్లో రికార్డు సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సీనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన పౌరాణిక చిత్రాల్లో `శ్రీమద్విరాట పర్వం` ఒక‌టి.

రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణ, దర్శకత్వపు బాధ్యతలతో పాటు ఐదు పాత్రల‌ను పోషించారు. వాటిలో శ్రీకృష్ణ, సుయోధన, అర్జున, బృహన్న పాత్రలే కాకుండా ప్రతినాయక పాత్ర అయిన సింహబలుడు కూడా ఒక‌టి కావడం విశేషం. అలాగే కథానాయికగా సైరంద్రి పాత్రలో కళాభినేత్రి వాణిశ్రీ న‌టించ‌గా.. వీరాభిమన్యుడుగా నంద‌మూరి బాలకృష్ణ చేశారు. మే 28, 1979లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. మ్యూజిక‌ల్‌గా ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news