Moviesఈ ఒక్క వీడియో తో ..ఆ మాట నిజం చేసేసిన విజయ్,...

ఈ ఒక్క వీడియో తో ..ఆ మాట నిజం చేసేసిన విజయ్, అనన్య..!!

ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. క్షణాల్లోనే ఆ వీడియో ట్రెండింగ్ లోకి వెల్లిపోయింది. యస్..టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా.. చెప్పండి. ఆ హైట్, ఆ వెయిట్, ఆ లుక్స్..అబ్బో ఏ అమ్మాయికి అయినా ఇట్టే నచ్చేస్తాడు . ముఖ్యంగా ఆయన మాట్లాడే తీరు..ఆ స్లాంగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది అంటారు జనాలు. విజయ దేవరకొండ తన కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా..ఆయనకి ఈరేంజ్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మాత్రం “అర్జున్ రెడ్డి” అనే చెప్పాలి.

అంతక ముందు విజయ్ వేరు..పెళ్లి చూపులు సినిమాలో కనిపించిన విజయ్ చాలా అమాయకంగా, తన పని తాను చేసుకుపోయే కుర్రాడు. కానీ, అర్జున్ క్యారెక్టర్ అలాంటిది కాదు. రఫ్ అండ్ టఫ్. ఆవేశం ఎక్కువ..ఉడుకు రక్తం..ఏదైన క్షణాల్లో దక్కాలి అనే మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ అది. ఆ పాత్రలో విజయ్ కాకుండా ఎవ్వరు చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యుండేది. అంత బాగా జీవించేశాడు విజయ్. ఇక ఇప్పుడు ఆస్దాయి ఎక్స్ పెక్స్టేషన్స్ నే ఉన్నాయి “లైగర్” సినిమా పై. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో “లైగర్” సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. తెర పై వీళ్ల రొమాన్స్ అద్దిరిపోతుందనే టాక్ ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు తాజా గా అనన్య పోస్ట్ చేసిన వీడియోతో ఆ మాట నిజమైంది అంటున్నారు నెటిజన్స్. కాగా ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో జగ్ జగ్ జీయో చిత్రంలో పంజాబ్బ‌న్ సాంగ్‌కు అదిరిపోయే హుక్ స్టెప్పులేశారు. బ్లాక్ అండ్ వైట్ షూట్‌లో విజ‌య్ ..అన‌న్య యెల్లో మినీ స్క‌ర్ట్‌లో స్టైలిష్ స్టెప్పులేసి కేక పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనన్య- విజయ్ దేవరకొండ జోడీ డాన్స్ వీడియో ఆన్ లైన్ మాద్యమాలపై సెన్సేషన్‌గా మారింది. ఈ వీడియోకు విజయ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘వీరిద్దరు కలిసి డాన్స్‌ చేయడం చూస్తుంటే లైగర్‌ చిత్రంలో వీరిమధ్య రొమాన్స్‌ ఏరేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతుంది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news