Moviesఆ సినిమాలో ఒకే ఒక్క సీన్ కోసం 3 ఏళ్లు న్యాయ‌పోరాటం...

ఆ సినిమాలో ఒకే ఒక్క సీన్ కోసం 3 ఏళ్లు న్యాయ‌పోరాటం చేసిన ఎన్టీఆర్‌..!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.. పౌరాణిక పాత్రలను తెరపై తీసుకొచ్చిన మహానటుడు. ఆయన తెలుగులోనే కాకుండా అఖిల భారత చలన చిత్రరంగంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఒరవడిని సంపాదించుకున్న గొప్పనటుడు. ప్రారంభం నుంచి విశిష్టమైన, విభిన్నమైన ఎన్నెన్నో అద్భుతమైన పాత్రలు చేశారయన.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. తెలుగువారి మదిలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారయన. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఓ చిత్రంలోని సన్నివేశాన్ని కట్ చేయాలని సెన్సార్ బోర్డు పట్టబట్టింది. అయితే… దానిలో త‌ప్పేముంది.. అది ఇప్పుడు స‌హ‌జం అంటూ.. అన్న‌గారు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. మూడేళ్ల పాటు పోరాడి మరీ ఆ సన్నివేశాన్ని తొలగించకుండా సినిమాను ధైర్యంగా రిలీజ్ చేశారు.

అదే.. ‘శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమా. అప్పట్లో ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ పెద్ద పోరాటమే చేశారు. దీనికి ఆయనే నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాల‌య్య‌.. సిద్ద‌య్య పాత్ర‌లో న‌టించారు. సిద‌య్య‌కు హీరోయిన్‌కు మ‌ధ్య సాగే.. సంభాష‌ణ‌లు.. ఈ క్ర‌మంలో హిందువుల‌.. ముస్లింల‌ను కించ‌ప‌రుస్తున్నారంటూ… ఈ చిత్రంలోని ఓ సీన్ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది.

అయితే.. అదేం త‌ప్పుకాదు.. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం లేదు.. అంటూ.. ఏకంగా ద‌ర్శ‌క‌, నిర్మాత కూడా అయిన‌. ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి మరీ 3 ఏళ్ళపాటు సినిమా కోసం పోరాడారు. తర్వాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు. అప్పట్లో ఇది సంచలనం గా నిలిచింది. ఈ చిత్రం 1984 నవంబరు 29న రిలీజ్ అయింది. సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news