ఆర్తీ అగర్వాల్ తెలుగు సినీ విలాకాసంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ తార. ఎంత స్పీడ్‌గా కెరీర్లో టాప్ హీరోయిన్ అయిపోయిందో అంతే స్పీడ్‌గా ఆమె ఫేడవుట్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉండే ఆర్తీ అగర్వాల్ ఫొటో చూసి దర్శకుడు కె. విజయ్‌భాస్కర్ ఆమెకు వెంకటేష్‌తో తీసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. 2001లో వచ్చిన ఈ సినిమా తర్వాత 2004 వరకు అసలు నాలుగేళ్లలో ఆమె అందరు స్టార్ హీరోలతోనూ వరుస పెట్టి సినిమాలు చేసేసింది. అందులో సూపర్ హిట్ సినిమాలే చాలా ఉన్నాయి.
వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్ – వసంతం.. చివరకు సంక్రాంతిలో చిన్న బిట్, తరుణ్‌తో నువ్వులేక నేనులేను, సోగ్గాడు, ఉదయ్‌కిరణ్‌తో నీస్నేహం, ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు, మహేష్‌బాబుతో బాబి, చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో నేనున్నాను, బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆమె డైరీ ఖాళీ లేదు. ఆ తర్వాత హీరో తరుణ్‌తో ప్రేమాయణం కావచ్చు… కెరీర్ పరంగా ఆమె తీసుకున్న రాంగ్ స్టెప్పులు కావచ్చు.. ఆమెను ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ చేసేశాయి.
ఆర్తీ కెరీర్ సర్వనాశనం కావడానికి తరుణ్‌తో ప్రేమాయణం మాత్రమే కారణమని చాలా మంది అనుకుంటారు. అయితే అదొక్కటే కారణం కాదు.. ఆర్తీ తండ్రి కూడా ఆమె కెరీర్ నాశనం కావడానికి కారణమని ఆమెతో అల్లరి రాముడు, అడవి రాముడు సినిమాలు తీసిన నిర్మాత చంటి అడ్డాల స్వయంగా చెప్పారు. ఆర్తీ అగర్వాల్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమె తల్లి దండ్రుల ప్రభావమే ఎక్కువుగా ఉండేదని.. ముఖ్యంగా ఆర్తీ తండ్రి ఆమెను రాంగ్ ట్రాక్ పట్టించి ఆమె కెరీర్ త్వరగా ఫేడవుట్ అయ్యేందుకు కారణమయ్యాడని చెప్పారు.
ఓ సారి తలకోన అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమెకు విపరీతమైన బాడీ ఫెయిన్స్తో పాటు, ఫీవర్ కూడా వచ్చిందని.. అయినా ఆమె ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని ఆ బాధ ఓర్చుకుని మరీ షూటింగ్ చేసిందని.. ఒకవేళ ఆ టైంలో ఆమె తండ్రి ఉండి ఉంటే ఆమెను ఆ రోజు షూటింగ్‌కు రానివ్వకుండా చేసేవాడని చంటి చెప్పారు.
సెట్లో ఆమె తల్లిదండ్రులు లేకుండా ఉంటే ఆర్తీ చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేదని.. వాళ్లు ఉంటే ఆమెకు ఎన్నో కండీషన్లు పెట్టేవారని ఆయన అన్నారు. ఆమె తండ్రి నిర్ణయాల వల్లే ఆమె ఫేడవుట్ అయిపోయి.. కెరీర్ త్వరగా ముగిసిపోయిందని చంటి అడ్డాల అన్నారు. ఆ తర్వాత ఆమె ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఆ బంధం పెటాకులు అయ్యి విడాకులు తీసుకోవడం.. చివరకు ఆమె బరువు తగ్గించుకునేందుకు చేయించుకున్న ఆపరేషన్ వికటించి మృతి చెందిన సంగతి తెలిసిందే.