Moviesప్లాప్ టాక్‌తో సూప‌ర్ హిట్ అయిన 5 సినిమాలు ఇవే...!

ప్లాప్ టాక్‌తో సూప‌ర్ హిట్ అయిన 5 సినిమాలు ఇవే…!

ఏదైనా సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ఆయా హీరోల అభిమానులు భారీ అంచ‌నాల‌తో ఉంటారు. స్టార్ హీరోల అభిమానులు అయితే ముందు రోజు నుంచే మెల‌కువతో ఉండి చూస్తుంటారు. వాళ్ల‌కు అంచ‌నాల‌కు కాస్త ఏ మాత్రం త‌గ్గినా డిజ‌ప్పాయింట్ అవుతారు. రిలీజ్ రోజు టాక్ ఎలా ఉన్నా రెండో రోజు నుంచి సినిమా మెల్ల‌గా ఫిక‌ప్ అవుతూ వ‌స్తుంది. చివ‌ర‌కు ప్లాప్ అన్న సినిమాలు, మిక్స్ డ్ టాక్ ఉన్న సినిమాలు కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన‌వి ఉన్నాయి. ఇలా మిక్స్ డ్ / ప్లాప్ టాక్‌తో హిట్ అయిన సినిమాలేంటో చూద్దాం.

ఇస్మార్ట్ శంకర్:
రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమాకు ముందు అంచ‌నాలు లేవు. పూరి జ‌గ‌న్నాథ్‌కు టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస ప్లాపులు రావ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ ప‌రిస్థితి అంతే అనుకున్నారు. అయితే ఆ త‌ర్వాత మెల్ల‌గా ఫిక‌ప్ అయిన ఈ సినిమా రు. 20 కోట్ల లాభాలు కొల్ల‌గొట్టింది. మాస్ ప్రేక్ష‌కుల‌కు సినిమా పిచ్చ‌గా న‌చ్చేసింది.

మహర్షి:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమాకు ముందు నెగిటివ్ టాకే వ‌చ్చింది. సినిమా ర‌న్ టైం ఎక్కువుగా ఉంద‌ని.. స్లోగా ఉంద‌ని అన్నారు. క‌ట్ చేస్తే రు. 100 కోట్ల‌కు పైగా షేర్ రాబట్టింది.

సరైనోడు:
స‌రైనోడు సినిమా ఫ‌స్ట్ డే చూసిన వాళ్లంతా బ‌న్నీ లాంటి క్లాస్ హీరోకు ఈ మాస్ సినిమా ఏంట‌ని పెద‌వి విరిచారు. బోయ‌పాటి ప్లాప్ సినిమా తీశాడ‌న్నారు. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వ‌చ్చాయి. క‌ట్ చేస్తే ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో అంచ‌నాలు అందుకోలేక‌పోయినా మాస్ జ‌నాల‌కు పిచ్చ‌గా న‌చ్చేసింది. సూప‌ర్ హిట్ అయ్యింది.

సన్నాఫ్ సత్యమూర్తి:
అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు కూడా ముందు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత క్లాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా ఎక్కేసింది. రు. 50 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

నాన్నకు ప్రేమతో:
ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కు ఫ‌స్ట్ డే ప్లాప్ టాక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఈ క్లాస్ స్టోరీ సెట్ కాద‌నే అన్నారు. పైగా సంక్రాంతికి డిక్టేట‌ర్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల పోటీ త‌ట్టుకుని రు. 54 కోట్లు షేర్ రాబ‌ట్టుకుంది.

పై సినిమాల‌తో పాటు తులసి, రచ్చ, శౌర్యం, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి సినిమాలు కూడా నెగటివ్ టాక్ త‌ట్టుకుని సినిమాలు హిట్ అయ్యాయి.

Latest news