Moviesఅరెరెరె..ఇదేంటి బండ్లన్నా ఇలా బిస్కెట్ అయ్యాడే..?

అరెరెరె..ఇదేంటి బండ్లన్నా ఇలా బిస్కెట్ అయ్యాడే..?

ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్ .. ఈ పేరుకు పెద్దగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న స్దాయి కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారి..మంచి మంచి సినిమాలను నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రోడ్యూసర్ గా బండ్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు అగ్ర హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉండడం వలన చాలా తొందరగా సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేశాడు. వాళ్ళల్లో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంతో ఇష్టం. నిజానికి పవన్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నిర్మాతగా బండ్ల గణేష్ అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రీసెంట్ గా బండ్ల గణేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం డేగల బాబ్జీ. మే20న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను వెంకట్‌ చంద్ర డైరెక్ట్ చేసారు. దర్శకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాల్లో బండ్ల గనేష్ యాక్టింగ్ బాగున్నప్పటికి.. నవరసాలతో డేగల బాబ్జీ గా పూర్తి స్దాయి పర్ ఫామెన్స్ ఇచ్చినప్పతికి..సినిమా ఫ్లాప్ అయ్యింది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల గణేష్ నటన ఆకట్టుకుంది.

రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రంలో గణేష్‌ పలు విభిన్న పాత్రల్లో అలరించాడు.అయితే, సినిమా ఫస్ట్ లుక్,ట్రైలర్ రిలీజ్ అయ్యిన్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ అభిమానులు సైతం సినిమా ను సపోర్ట్ చేస్తున్న అన్న టాక్ వినపడింది. కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కధ వేరేలా ఉంది. సినిమా చూసిన జనాలను రివ్యూ అడుగుతుంటే ఓపెన్ గానే బాగలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ సినిమాతో ఏదో చేసేదాం అనుకున్న బండ్లన్న బిస్కెట్ అయ్యాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news