సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది. కెరీర్ ఆరంభంలో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్‌కు గురి కాక తప్పడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలను ఏలేస్తోన్న చాలా మంది క్రేజీ హీరోయిన్లు సైతం కెరీర్ ఆరంభంలో ఎన్నో లైంగీక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఎప్పుడు అయితే కంగనా రనౌత్ లాంటి వాళ్లు లైంగీక వేధింపులపై ఓపెన్ అయ్యారో అప్పటి నుంచే నార్త్ లేదు సౌత్ లేదు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా తమకు ఎదురైన అనుభవాలను చెపుతున్నారు.
సౌత్‌లో సింగర్ చిన్మయి లాంటి వాళ్లు ఏకంగా వైరిముత్తు లాంటి వాళ్ల మీదే కామెంట్లు చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఇక తెలుగులో శ్రీ రెడ్డి చేసిన రచ్చ అయితే అంతా ఇంతా కాదు. అయితే మరి కొందరు హీరోయిన్లు మాత్రం కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చెపితే బెదిరింపులు వస్తుండడంతో తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా గప్‌చుప్‌గా ఉంటున్నారు.
తాజాగా సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె కాస్టింగ్ కౌచ్ అనేది గతంలో ఉందని.. ఇప్పుడు కూడా ఉందన్నారు. ఇది భవిష్యత్తులోనూ ఉంటుందని.. అయితే దీనిపై గతంలో ఎవ్వరూ పబ్లిసిటీ చేసుకోలేదని ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు చాలా మంది కాస్టింగ్ కౌచ్ పై రోడ్డు ఎక్కుతున్నారని.. అప్పటకీ ఇప్పటకీ ఇదొక్కటే తేడా అని చెప్పారు.
తాను కూడా గతంలో కాస్టింగ్ కౌచ్ తో ఇబ్బందులు పడ్డానని… ఓ సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారని.. ఆ తర్వాత తనను తొలగించారని.. ఎందుకు తీసేశారని తాను మేనేజర్‌ను అడిగానని… అయితే అతడు ఇచ్చిన ఆన్సర్‌తో నేను షాక్ అయ్యానని ఆమె చెప్పారు. మరో హీరోయిన్ కమిట్మెంట్ ఇవ్వడంతో .. నన్ను తప్పించేసి ఆ ప్లేసులో ఆమెను తీసుకున్నారని మేనేజర్ చెప్పినట్టు రాధా ప్రశాంతి తెలిపింది.