గత నాలుగైదేళ్లుగా అల్లు అర్జున్ రేంజ్ ఎలా పెరిగిపోతోందో చూస్తూనే ఉన్నాం. అల వైకుంఠపురంలో సినిమా వచ్చి నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసింది. పుష్ప దెబ్బకు బాలీవుడ్ షేక్ అయిపోయింది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే పుష్ప బాలీవుడ్‌లో ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. పుష్ప ఓవరాల్‌గా రు 365 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సాధించిన అప్రతిహత విజయంతో దర్శకుడు సుకుమార్ ఇప్పుడు పుష్ప 2ను భారీ లెవల్లో తీస్తున్నాడు.
పుష్ప 2పై బాలీవుడ్‌లో కూడా అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సీక్వెల్ కోసం ఏకంగా రు. 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాడు. పుష్ప ది రైజ్ దెబ్బకు బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో పాటు మనోడిపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పుష్ప ది రూల్ విషయంలో సుకుమార్ ఎక్కడా రాజీపడడం లేదు.
పైగా మన తెలుగు, సౌత్ ఇండియా సీక్వెల్స్ ఒకదానిని మించి మరొకటి వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి. దీంతో పుష్ప ది రూల్‌పై కూడా అక్కడ తారా స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. సినిమాకు పెడుతోన్న బడ్జెట్టే ఏకంగా రు. 400 కోట్లు కావడం… అంచనాలు భారీగా ఉండడమే కాదు.. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పుడు టాప్ లేపే లెవల్లో నడుస్తోంది.
పుష్ప 2 ప్రి రిలీజ్ బిజినెస్‌పై వస్తోన్న వార్తలు చూస్తుంటే నేషనల్ లెవల్లో ట్రేడ్ వర్గాల్లో బిగ్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాకు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రు. 300 కోట్లకు పైగా ఆఫర్లు వస్తున్నాయట. అన్ని భాషల్లో కలుపుకుంటే ఓవరాల్‌గా రు. 600 కోట్ల బిజినెస్ ఈ సినిమా జరుపుకోనుందని తెలుస్తోంది. ఇది మామూలు సంచలనం కాదనే చెప్పాలి.