Movies14 ఏళ్ల వయసులోనే అలాంటి పని..సిగ్గుందా అరియానా..?

14 ఏళ్ల వయసులోనే అలాంటి పని..సిగ్గుందా అరియానా..?

అరియానా.. పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం అందుకున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ ఒకరు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఫినాలేలో అడుగు పెట్టిన ఈ భామ.. షో తర్వాత హల్‌చల్ చేస్తోంది. సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అరియానా… బిగ్ బాస్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి .. టైటిల్ సాధించిలేకపోయినప్పటికీ.. ఆడపులిలా సింగిల్‌గానే ఆట ఆడింది. బిగ్ బాస్ షో వల్ల క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది అరియానా అని చెప్పొచ్చు. యాంకర్‏గా కెరీర్ ఆరంభించిన అరియానా.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.

కాగా ఈ మధ్యనే బిగ్ బాస్ ఓటీటీలోకి కుడా వెళ్లిన అరియానా తనదైన స్టైల్ లో ఆట ఆడుతూ..అందరిని మెప్పిస్తుంది. ఈ మధ్యనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా..తన ప్రేమ గురించిన సంచలన విషయాని బయటపెట్టింది. దీంతో ఆమె ను నెట్టింట ఏకిపారేస్తున్నారు జనాలు. టెన్త్ లో ఒక్క అబ్బాయిని సీరియస్ గా లవ్ చేశాన్నై… నాకు డాడీ లేరు అందుకే నాకు అబ్బాయి తో ఎలా ఉండాలో తెలియదు. ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే తన కేరింగ్ నాకు బాగా నచ్చేసింది. కొంత కాలం ఫోన్ లో మాట్లాడుకుంటూ గడిపాం.

ఆ తరువాత అబ్బాయి కోసం నేను ఇళ్లు వదిలి వెళ్లిపోయాను. హైదరాబాదులో మేమిద్దరం కలిసే ఒక్కే ఇంట్లో ఉన్నాం. ఆ సమయంలోనే చాలా డీప్ లోకి వెళ్ళిపోయాము. కానీ ఒక రోజు నేను చూడకూడనిది ఒకటి చూశా.. అది చూసిన తర్వాత నేను హర్ట్ అయ్యాను, నా మనసు విరిగిపోయింది. నేను ఏం చూశాను అనేది ప్రపంచానికి కూడా చెప్పుకోలేను..అలా అని మర్చిపోలేను.. నా పరిస్థితి అలాంటిది అంటూ కన్నీరుమున్నీరైంది. ఇక దీని పై నెట్టింట అరియానా ను నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. అరియాన ఇలాంటి ఆడపిల్ల అని అనుకోలేదు అని.ఒక్క అబ్బాయి తో అలా ఎలా ..అసలు సిగ్గుందా అంటూ తిట్టిపోస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news