మౌని రాయ్ – సూరజ్ నంబియార్ గత నెలలోనే గోవాలో డ్రీమ్ వెడ్డింగ్ జరుపుకున్నారు. వెడ్డింగ్ తర్వాత హనీమూన్‌ను కశ్మీర్‌లోని గుల్ మార్గ్‌లో హ్యాపీగా జరుపుకున్నారు. ఇక మౌని తన ఇన్‌స్టా గ్రామ్ ఫీడ్‌ను ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫొటోలతో నింపేస్తూ ఉంటుంది. తాజాగా మంచుకొండల నేపథ్యంలో మౌని – సూరజ్ జంట ఫొటో షూట్‌తో ఇన్‌స్టా నిండిపోయింది.
మౌని ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మౌని రాయ్ అయితే గట్టకట్టే కశ్మీర్లో నల్లటి మోనోకినీలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. బికినీలో ఆమె చాలా స్టైల్‌గా ఉన్న ఈ ఫోటోలు అయితే కుర్రకారు పదే పదే చూసి ఎంజాయ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మౌనిరాయ్ గడ్డకట్టే కశ్మీర్లో చాలా సాహసం చేసిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం ఈ ఫొటోలు చూశాక గడ్డకట్టే గుల్మార్గ్ లో కూడా టెంపరేచర్ పెంచేసిందని ఫిదా అవుతున్నారు. మంచుకొండల కింద ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌లో మౌని ఈ ఫొజులు ఇచ్చింది. ఆమె అభిమానుల్లో కొందరు అయితే తు మౌని నహీ తూ ఫైర్ హై అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్ ట్వీకింగ్ చేస్తూ కామెంట్ పెట్టారు.
మరో అభిమాని అయితే పుష్ప నామ్ సుంకే ఫ్లవర్ సంజే క్యా.. ఫ్లవర్ నహీ ఫైర్ హై అన్న కామెంట్ పెడితే అందుకు మౌని నామ్ సన్ కె ఫ్లవర్ సంజయ్ నీ కియా ఫైర్ అని స్మైలీ రిప్లై ఇచ్చింది. ఏదేమైనా మౌని బికినీ షో బంపర్ హిట్ అయ్యింది. కేజీఎఫ్‌లో ఐటమ్ నంబర్ తో ఆకట్టుకున్న మౌనీకి ఆ తర్వాత సౌత్‌లో అనుకున్న రేంజ్లో క్రేజ్ రాలేదు. బాలీవుడ్లో మాత్రం అడపా దడపా మెరుస్తూ వస్తోంది.