విడాకుల ప్రకటన తరువాత సమంత పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. రోజుకో ఓ సెన్సేషనల్ పోస్ట్ పెడుతూ డైరెక్ట్ గా కొన్నిసార్లు..పరోక్షంగా కొన్నిసార్లు అక్కినేని అభిమానులను హర్ట్ చేస్తుంది. దీంతో సమంత అంటేనే మండిపడుతున్నారు నాగ్ చై ఫ్యాన్స్. విడాకుల తరువాత కొన్ని రోఝులు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయిన సమంత ఆ తరువాత తాను ఏం చెప్పాలి అనుకున్నా సోషల్ మీడియానే వేదికగా చేసుకుని..కష్టాని, ఇష్టాని, బాధను,ఆనందాని అభిమానులతో పంచుకుంది. పనిలోపని కోపాని చూపెట్టింది.
ఇక కొన్ని రోజులకి రూట్ మారుస్తూ హాట్ పిక్స్ ఇన్స్టా లో పోస్ట్ చేసింది. నాగచైతన్య ను ఎలాగైన మర్చిపోవడానికి టూర్ లు బాగా తిరిగింది. ఇష్టమైన వాళ్లతో ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తూ..ఇష్టమైన బట్టలు వేసుకుంటూ ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ..వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచింది. ఈ క్రమంలోనే అమ్మడు టూ పీస్ బికినీ వేసుకుని ఫోటోకు ఫోజులిచ్చింది. అంతేనా.. అక్కడితో ఆగకుండా ఆ టూ పీస్ బికినీలోనే యోగాసనాలు వేసింది. ఆ వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది.
ఇక ఆ వీడియో కొందరికి చూడటానికి బాగానే ఉన్నా..అక్కినేని అభిమానులకు మాత్రం అస్సలు నచ్చలేదు. వాళ్ళను తీవ్రంగా హర్ట్ చేసింది. ఇక ఎప్పటికైన కలుస్తారులే అని అనుకున్న వాళ్లకి ఇక కలవబోయేదిలేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయితే , సమంత పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అప్పట్లో అభిమానులతో లైవ్ లో పాల్గోని ముచ్చటించిన అమ్మడు.. ఓ నెటిజన అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో సమంతని తన ఫాలోయర్స్ ప్రశ్నలు అడుగుతుండగా… మరో ఫాలోవర్ ‘మీకు బాబు ఎప్పుడు జన్మిస్తాడు? అని ప్రశించాడు. ఇక ఈ ప్రశ్నతో విసిగిపోయిన సమంత.. ‘నేను తల్లి కావాలని ఎదురుచూస్తున్న వారికి ఇదే నా సమాధానం. వారందరికీ ఒక మంచి న్యూస్ చెప్తాను. 2022, ఆగస్టు 7 న ఉదయం 7 గంటలకు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నా” అంటూ చెప్పుకొచ్చింది.
అది అప్పుడు ఆమె జోక్ గా అన్నారో సీరియస్ గా అన్నారో తెలియదు కానీ ఆ విషయాని ఫ్యాన్స్ ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. ఆ వీడియోని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వేళ సామ్ చెప్పింది నిజమే అయితే.. ఈ జంట విడిపోకుండా ఉంటే ఈ పాటికి ఒక గుడ్ న్యూస్ ని అక్కినేని ఫ్యామీలీ అభిమానులకు తెలిపి ఉండేది అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.