Moviesసుక్కు మాస్టర్ ప్లాన్..పుష్ప 2 లో మరో హీరోయిన్ రెడీ.. ఇప్పుడు...

సుక్కు మాస్టర్ ప్లాన్..పుష్ప 2 లో మరో హీరోయిన్ రెడీ.. ఇప్పుడు అసలు కధ స్టార్ట్ అయ్యేది..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంటటి ఘన విజయం సాదించిందో ప్రత్యేకించి చెప్పనవశరం లేదు. రిలీజ్ అయిన రెండు మూడు రోజులు మిక్స్డ్ టాక్ ను సంపాదించుకున్నా..ఆ తరువాత మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా రష్మిక చేసిన పుష్ప సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదట పార్ట్ లో ది రైజ్ అంటూ పుషప ఎలా ఎదిగాడో చూయించిన సుకుమార్..రెండో పార్ట్ లో ది రూల్ అంటూ టైటిల్ రివీల్ చేశాడు.

అంటే ఇప్పుడు పుష్ప రాజ్ ఎలా రూల్ చేస్తాడో మనం చూడబోతున్నాం. ముందుగానే ‘పుష్ప’ను రెండు భాగాలుగా విడగొట్టాలని నిర్ణయించుకున్న తరువాత.. కథలో చాలా మార్పులు చేసాడట సుకుమార్. మొదట ఫస్ట్ పార్ట్ వరకే కధ రాసుకున్న సుక్కు..ఆ తరువాత కధను డివైడ్ చేసుకుని కొన్ని మార్పులు చేసి సెకండ్ పార్ట్ ను కూడా రాసుకున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.


శ్రీ వల్లిని పుష్ప రాజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ లో శ్రీ వల్లి ప్రెగ్నెంట్ అవుతుందట. మళ్లీ తన నాన్న పుట్టబోతున్నాడంటూ పుష్ప చాలా సంతోషంగా ఫీల్ అవుతారట. ఇక ద్రాక్షాయని తన తమ్ముడిని చంపిన పగతో రగిలిపోతూ..ఎలాగైన పుష్ప బిడ్డను చంపాలి అనుకుని ఫైనల్ గా కడుపుతోఉన్న శ్రీవల్లిని గొంతుకోసి చంపేస్తుందట. దీంతో డీప్రేషన్ లోకి వెళ్ళిపోతాడట పుష్ప.

స్మగ్లింగ్ పనులు ఆపేసి చనిపోయిన శ్రీవల్లినే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న పుష్ప లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చు పుష్పను టోటల్ గా మార్చేస్తుందట. ఇక ఆ అమ్మాయే పుష్ప సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఉండబోతుంది అని..ఆ అమ్మాయి కధను టోటల్ మార్చబోతుందని ఓ మ్యాటర్ లీకైంది. పార్ట్ 2 లో మాస్ మసాలా అంశాలు పెట్టాలంటే కచ్చితంగా మంచి గ్లామరస్ హీరోయిన్ కావాలి. అలాంటి హీరోయిన్ కోసం కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news