అఖండ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో బాలయ్యతో పాటు బోయపాటి శ్రీను ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ బోయపాటి స్టామినా ఏంటో టాలీవుడ్‌కు మరోసారి తెలియజేసింది. బోయపాటి దమ్మున్న డైరెక్టరే. అయితే వినయ విధేయ రామ్ ప్లాప్ అయ్యాక కొందరు ఆయన టాలెంట్‌ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. కరోనా రెండో వేవ్ తర్వాత ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని కూడా అఖండ థియేటర్లలోకి వచ్చి సక్సెస్ అయ్యింది.
ఈ సినిమా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అసలు 50 రోజులు అన్న పదం టాలీవుడ్లో మర్చిపోతోన్న వేళ బోయపాటి – బాలయ్య అఖండతో అఖండ జాతర చూపించారు. ఇక థియేట్రికల్ ఆదాయమే రు. 150 కోట్ల పైన వస్తే.. నాన్ థియేట్రికల్ ఆదాయంతో కలిపితే అఖండకు మొత్తం రు. 200 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలయ్య లాంటి సీనియర్ హీరో.. అది కూడా కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా ? అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ గర్జన మోగించింది.
అఖండ హిట్ అయ్యాక బాలయ్య మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మలినేని గోపీచంద్ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. బోయపాటి అఖండ – 2 ఉంటుందని చెప్పారు. బోయపాటే స్వయంగా అఖండకు సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో అఖండ – 2 ఎప్పుడు ఉంటుందన్న చర్చ సహజంగానే స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం బోయపాటి యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. చిట్టూరి శ్రీనివాస్ అనే నిర్మాత రామ్ – బోయపాటి కాంబినేషన్ ఫిక్స్ చేశాడు.
ఈ సినిమాకు గాను బోయపాటికి రు. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇది బోయపాటి కెరీర్లోనే హయ్యస్ట్ అంటున్నారు. ఈ సినిమా 2022 ఎండింగ్‌లోనో లేదా 2023 ఫిబ్రవరి – మార్చికో పూర్తవుతుంది. ఆ తర్వాత బోయపాటి ఐదారు నెలలు అఖండ – 2 స్క్రిఫ్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 2023లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే 2024 ఎన్నికలకు ముందుగా అఖండ – 2 రిలీజ్ అవ్వొచ్చు. ఈ లోగా బాలయ్య మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి సినిమాలతో పాటు మరో సినిమా పూర్తి చేసినా చేసేయొచ్చు.
ఇక 2014 ఎన్నికలకు ముందు వచ్చిన లెజెండ్ ఆ ఎన్నికల్లో టీడీపీకి మాంచి ఊపు ఇచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా అఖండ-2ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తారని అంటున్నారు.