Moviesఎన్టీఆర్ - కొర‌టాల.. ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌..!

ఎన్టీఆర్ – కొర‌టాల.. ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఇప్పుడు త‌మ కెరీర్‌లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఐదు వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉండ‌డంతో పాటు ఇటు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. అటు కొర‌టాల శివ ఓట‌మి అనేది లేకుండా వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్నాడు. కొర‌టాల తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తెర‌కెక్కించిన ఆచార్య సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇటు డ‌బుల్ హ్యాట్రిక్‌కు చేరువ అయిన స్టార్ హీరో, అటు ఫుల్ ఫామ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల కాంబినేష‌న్ అన‌గానే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు పెద్ద బ్యాన‌ర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ భారీ బడ్జెట్ సినిమాను కొర‌టాల స‌న్నిహితుడు అయిన మిక్కిలినేని సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

 

గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల కాంబినేష‌న్లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి కొర‌టాల – ఎన్టీఆర్ కాంబినేష‌న్ అన‌గానే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ సినిమాను కంటిన్యూగా పూర్తి చేసి ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ రివీల్ అవుతోంది. హీరోయిన్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేయ‌డంతో బాలీవుడ్ భామ ఆలియాభ‌ట్‌ను తీసుకున్నారు.

ఎన్టీఆర్ ప‌క్క‌న తాను న‌టిస్తున్న‌ట్టు ఆలియా కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచందర్ పేరు ఖ‌రారైన‌ట్టే..! ఇక రెండో హీరోయిన్ పాత్ర కోసం పెళ్లిసందD ఫేం శ్రీలీల‌ను తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కొర‌టాల ప్రెస్‌మీట్ పెట్టి ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణుల పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news