Moviesఆ టైంలో ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయలేదు.. విశ్వ‌క్‌సేన్ కన్నీళ్లు...!

ఆ టైంలో ఎవ్వ‌రూ స‌పోర్ట్ చేయలేదు.. విశ్వ‌క్‌సేన్ కన్నీళ్లు…!

టాలీవుడ్‌లో త‌క్కువ టైంలోనే త‌న‌కంటూ స‌ప‌రేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్‌. విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం అర్జున క‌ల్యాణం సినిమా చేస్తున్నాడు. విశ్వ‌క్‌సేన్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే ఖ‌చ్చితంగా అందులో ఏదో డిఫ‌రెంట్ ఉంటుంద‌న్న అంచ‌నాలు యూత్‌లో ఉంటాయి. త‌క్కువ టైంలోనే యూత్‌లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న విశ్వ‌క్ సేన్ స్టైలే డిఫ‌రెంట్‌.

విశ్వ‌క్ తాజాగా స‌న్నీ హీరోగా న‌టిస్తోన్న ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వ‌చ్చాడు. ఈ ఈవెంట్‌లో విశ్వ‌క్ కెరీర్ స్టార్టింగ్‌లో తాను ప‌డిన ఇబ్బందులు త‌ల‌చుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. తాను అవ‌కాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాన‌ని.. ఏడెనిమిది ఆఫీసుల్లో త‌న‌కు రెండు నెల‌ల వ‌ర‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పేవార‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వెళితే త‌న‌కు ఛాన్స్ లేద‌ని చెప్పేవార‌ని అన్నాడు.

ఆ టైంలో త‌న‌ను ఎవ‌రైనా స‌పోర్ట్ చేస్తే బాగుండేద‌ని అనుకునేవాడిని అని.. ఆ టైంలో నేష‌నల్ అవార్డు విన్న‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ త‌న‌కు హీరోగా ఛాన్స్ ఇచ్చి.. త‌న‌ను హీరోను చేసేవాడ‌ని విశ్వ‌క్‌సేన్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. తాను న‌టించిన నాలుగైదు సినిమాల్లో అవ‌కాశాలు ఉంటే.. తాను ఇత‌రుల‌కు కూడా సాయం చేసేవాడిని అని విశ్వ‌క్ చెప్పాడు.

ఇక తాను బిగ్‌బాస్ చూసేవాడిని అని.. హౌస్‌లో హౌస్‌మెట్స్ ఫైట్ చేసుకునే ప్ర‌తిరోజూ చూసేవాడినని తెలిపాడు. స‌న్నీ హౌస్‌లో జెన్యూన్‌గా ఫైట్ చేశాడ‌ని.. అందుకే అత‌డిని స‌పోర్ట్ చేశాన‌ని విశ్వ‌క్‌సేన్ చెప్పాడు. అలాగే త‌న వ‌ద్ద‌కు ఏవైనా మంచి క‌థ‌లు వ‌స్తే వాటిని స‌న్నీవ‌ద్ద‌కే పంపుతాన‌ని కూడా చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news