బాలయ్య కెరీర్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. హిట్ అయ్యాయి.. కొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సినిమాలు ఎప్పటకీ గుర్తుండిపోతాయి. ఆ రెండు సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ఇక 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహానాయుడు ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమాకు పోటీగా 2001, జనవరి 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు వచ్చింది. అప్పట్లోనే రు. 11 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. అప్పటికే గుణశేఖర్, చిరు కాంబోలో వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ కావడంతో మృగరాజుపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.
ఇటు బాలయ్య నరసింహానాయుడు సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయ్యింది. మృగరాజుతో పోలిస్తే ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అసలు మృగరాజ్ తొలి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే.. నరసింహానాయుడు తొలి ఆటకే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. భారతదేశ సినిమా చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడడం ఇదే ప్రధమం. నరసింహానాయుడు చాలా బీ, సీ సెంటర్లలో నెలకొల్పిన రికార్డులు ఇప్పటకీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.
అయితే ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఒకే ప్రింట్‌తో రెండు థియేటర్లలో ఏకంగా 100 రోజులు ఆడింది. కోడుమూరుతో పాటు గూడూరు సిటీలో రెండు చోట్ల 100 రోజులు ఆడింది. రెండు చోట్ల 100 రోజులు ఆడడం రికార్డ్. ఇప్పుడు అంటే శాటిలైట్ సిస్టమ్ వచ్చేసింది. అప్పుడు ఫ్రింట్లు ఉండేవి.. అయితే ఈ రెండు కేంద్రాలు పక్క పక్కనే ఉండడంతో ఒకే ప్రింట్‌పై రిలీజ్ చేశారు. ప్రతి షో ప్రారంభం అయిన వెంటనే ఆ షో పూర్తయ్యే వరకు ఆ ఫ్రింట్‌ను అటూ ఇటూ నాలుగు సార్లు తిప్పాల్సి ఉంటుంది.
అలా ఒక రోజు రెండో రోజులో కాదు.. ఏకంగా 100 రోజులు పాటు ఆడించారు. సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో పాటు భారీ వసూళ్లు రావడంతో ఇది సాధ్యమైంది. ఇలా ఒకే ప్రింట్‌పై రెండు కేంద్రాల్లో 100 రోజులు ఓ సినిమా ఆడిన చరిత్ర మరో హీరోకు లేదు. ఇక ఇది భవిష్యత్తులో కూడా సాధ్యంకాదు. ప్రపంచ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ బాలయ్యకే సొంతం అయ్యింది.