Moviesపుష్ప- 2: ఐటెం సాంగ్‌ లో కనిపించబోతున్న ఆ స్టార్ హీరోయిన్...

పుష్ప- 2: ఐటెం సాంగ్‌ లో కనిపించబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. స్కై రేంజ్ అంచ‌నాల‌తో శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రెండు భాగాలుగా భారీ రేంజ్‌లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు. భారీ హైప్ మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యిన అల్లు అర్జున్ పుష్ప బాక్స్ ఆఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతుంది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ రాను రాను పుంజుకొని అల్లు అర్జున్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. మొదటి రోజు నుంచి కలక్షన్ల సునామీ కురిపించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ నెలకోల్పింది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల ప్రవాహం కనిపిస్తుండటం విశేషం.

ఇక ఫిబ్రవరీ నుండి పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభిసానని చెప్పిన సుకుమార్ మొదటి షెడ్యూల్ లోనే కొన్నీ ఆసక్తికర సీన ఫినిష్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు పుష్ప 1 లో సమంత తో ఐటెం సాంగ్ చేయించిన ఈయన పుష్ప 2 లో కూడా అంతకుమించి ఉండేలా ఓ పాటను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక పుష్ప 2 లో బన్నీ పక్కన ఐటెం సాంగ్ చ్జేయడానికి బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటినుంచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లను ఫిల్టర్ చేస్తున్నారట సుక్కు. షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే తొలి షెడ్యూల్ లోనే ఈ ఐటెం సాంగ్ షూట్ ఫినిష్ చేయాలని సుక్కు భావిస్తునట్లు ఇన్‌సైడ్ టాక్. చూడాలి మరి ‘పుష్ప ది రూల్’ విశేషాలపై అధికారిక ప్రకటన ఎప్పుడిస్తారనేది!.

.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news