సాధారణంగా ఎవరికీ అయినా సినిమాల్లోకి వచ్చి వెండితెర మీద ఒక వెలుగు వెలిగి పోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. ఈ కోరిక ఎవరికైనా ఉండటం సహజం. అయితే సినిమా రంగంలో అవకాశాలు వచ్చిన వారు నిలదొక్కుకునేందుకు మాత్రం చాలా అష్టకష్టాలు పడాల్సిందే. ఎవరో ఒకరిద్దరు మాత్రమే వారసత్వంగా అంది వచ్చిన అవకాశాలతో స్టార్ హీరో హీరోయిన్లు అవుతారు తప్ప చాలామందికి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎన్నో బాధలు తప్పవు. ఇక తెలుగు అమ్మాయిలు సినిమా రంగంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ వారికి చాలా సంప్రదాయాలు అడ్డు వస్తాయి. వారు సినిమాల్లోకి రాణించటం అంటే ఘోరమైన తపస్సులో గెలిచినట్టే లెక్క. ఈ క్రమంలోనే ముందుగా చిన్నచిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాణి ఒకరు.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జయవాణి చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఎక్కువగా విలన్ క్యారెక్టర్ లతో ప్రేక్షకులను మెప్పించారు. జయవాణి ఫేస్ గుర్తుకు రాగానే ప్రతి ఒక్కరూ ఆమె చేసిన విలన్ పాత్రలను గుర్తుకు తెచ్చుకుంటారు. తెలుగులో మహిళా విలన్ పాత్రలు చేసే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే ఆ పాత్రలో ఛాలెంజింగ్ గా నటించి మెప్పించిన తక్కువ మందిలో జయవాణి కూడా ఒకరు. అయితే ఇందుకు తన తండ్రి సహకారం కూడా ఉంది ఆమె చెప్పింది.
కొందరు దర్శకులు బోల్డ్ సినిమాల్లో నటించాలని ఆఫర్లు ఇచ్చినా తను మాత్రం తిరస్కరించాను అని చెప్పింది. ఇక చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి రావడంతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని… అయితే తన తండ్రి సహకారంతోనే పరిశ్రమలో రాణించానని ఆమె చెప్పింది. అయితే తనకు చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి విపరీతంగా ఉండడంతో తనను… తన సొంత మామయ్య అయిన గుమ్మడి చంద్రశేఖర రావుకి ఇచ్చి పదో తరగతిలోనే పెళ్లి చేశారని చెప్పింది.
అయితే పెళ్లి అయ్యాక కూడా భర్త సహకారంతో తాను బీఏ వరకు చదివానని… ఆయన ఎలాంటి కండిషన్లు పెట్టకపోవడంతో ఇండస్ట్రీలో రాణిస్తున్నానని.. చెప్పింది ప్రారంభంలో నల్లగా ఉండటంతో కొందరు అవకాశాలు ఇవ్వలేదని జయవాణి చెప్పింది.