Moviesఅమెరికాలో అఖండ అన్‌స్టాప‌బుల్ రికార్డులు

అమెరికాలో అఖండ అన్‌స్టాప‌బుల్ రికార్డులు

యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టింది. వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా.. లెజెండ్ రెండు సూపర్ హిట్ అయ్యాయి. అఖండ కూడా కచ్చితంగా హ్యాట్రిక్ అవుతుందని తెలుగు సినిమా వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు అందుకుంటూ అఖండ హిట్టయింది. వినయ విధేయ రామ లాంటి డిజాస్ట‌ర్‌ సినిమా త‌ర్వాత త‌న‌ను టార్గెట్ చేసిన వారికి ఈ సినిమాతో చెంప పెట్టు లాంటి ఆన్సర్ ఇచ్చారు బోయ‌పాటి. ఇక ఈ సినిమా వ‌సూళ్ల‌ విషయంలో అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కూడా బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది.

అఖండ సినిమా వసూళ్లు చూసి బయ్య‌ర్ల‌తో పాటు తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ తొలి రోజే ఏకంగా 23 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు.. రు. 15 కోట్ల షేర్ రాబ‌ట్టిన అఖండ ఓవర్సీస్‌లో కూడా వసూళ్ళ పరంగా దుమ్ము రేపుతోంది. కేవలం ప్రీమియర్ షోల తోనే మూడు లక్షల డాలర్లను దక్కించుకున్న అఖండ అప్పుడే హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ సినిమాలో లాంగ్ ర‌న్‌లో 1.5 మిలియన్ డాలర్లు రాబడుతుందని అంటున్నారు.

అమెరికాలో మాత్ర‌మే కాదు.. ఈ సినిమా రిలీజ్ అయిన విదేశాల్లో కూడా అన్‌స్టాప‌బుల్ అంటూ వ‌సూళ్లు సాధిస్తోంది. బాల‌య్య అభిమానులు మాత్ర‌మే కాకుండా.. తెలుగు సినిమా అభిమానులు అంద‌రూ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బాల‌య్య అఖండ గ‌ర్జ‌న లాంటి న‌ట‌న‌, థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఓవ‌ర్సీస్‌లో ఈ రేంజ్‌లో బాల‌య్య సినిమాకు వ‌సూళ్లు వ‌స్తుండ‌డంతో బాల‌య్య అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

ఇక ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. పూర్ణ కీల‌క పాత్ర‌లో కనిపించింది. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే అఖండ సింహా, లెజెండ్‌ను మించి వ‌సూలు చేస్తుంద‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news