మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన కలం ఆగింది. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయినా ఎన్నో మరపురాని మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. దిగ్గజ సినీగేయ రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి మరణం తర్వాత టాలీవుడ్ అంతా ఎంతో బాధపడుతుంది. కాలానికి అనుగుణంగా మారుతూ తన కలంతో ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన సిరివెన్నెల గురించి ఒక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం అర్ధరాత్రి మేల్కొనే సూర్యుడు అంటూ చెప్పిన డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
నిజానికి ఆయన తెరమీద కనపడని హీరో.. అయితే మనం ఆయన్నే హీరో అనాలి. అలాంటి హీరోకే నచ్చిన హీరోలు ఉన్నారంటూ వారు నిజంగా గ్రేట్ అనుకోవాలి. సిరివెన్నెలకు మన టాలీవుడ్‌లో ఇద్దరు హీరోల డెడికేషన్ అంటే ఎంతో ఇష్టం అట. ఆ ఇద్దరూ కూడా మెగా కాంపౌండ్ హీరోలే. మెగాస్టార్ చిరంజీవి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రుద్రవీణ సినిమా టైంలో చిరంజీవి డెడికేషన్‌కు సిరివెన్నెల ఫిదా అయిపోయాడట.
చిరంజీవి స్టార్ డమ్ ఏంటి ? అంత పెద్ద ఇమేజ్ ఉన్న హీరో.. ఆ ఇమేజ్ పక్కన పెట్టేసి సామాజిక స్పృహ ఉన్న సినిమా చేయడం ఏంటని ఆయన ఆశ్చర్యపోయారట. ఆ సినిమా తర్వాత తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆయన పలుసార్లు చెప్పారు. చిరంజీవి సినిమా అంటే రాత్రి అంతా నిద్రలేకుండా సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పాటలు రాసేవారట.
ఇక ఈ తరం జనరేషన్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే సిరివెన్నెలకు ఎంతో ఇష్టం అట. చిరంజీవిలా డెడికేషన్‌తో పనిచేసే ఏకైక హీరో అల్లు అర్జున్ మాత్రమే అని సిరివెన్నెల కొనియాడారు.