టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాని సంపాదించుకున్న సమంత..టాలీవుడ్ లోనే బడా ఫ్యామిలీ అయిన అక్కినేని ఇంట కోడలు గా అడుగుపెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఇక నాలుగేళ్ల పాటు ఎంతో హ్యాపీగా సాగిన వీరి మ్యారిడ్ లైఫ్ .. కొన్ని రోజుల ముందు బ్రేకప్ అయ్యింది. కారణం చెప్పకుండానే మేం విడిపోతున్నం అంటూ నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయారు.
ఇక నాగ చైతన్యతో తో విడాకులు తీసుకున్న తరువాత సమంత ..అస్సలు అక్కినేని కుటుంబం గురించి కానీ, వాళ్ళ ఫామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ల గురించి కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక్క పోస్ట్ పెడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచే ఈ అమ్మడు కనీసం నాగచైతన్య పుట్టిన రోజు కి కూడా విష్ చేయలేదు.
దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు సమంతకు నాగ చైతన్య అంటే ఎంత కోపం ఉందో. ఇక విడాకుల తరువాత సమంత వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ గా ఉంది. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత ..తాజాగా ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది సామ్.
“అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్” అనే అంతర్జాతీయ సినిమాకు సమంత సైన్ చేసింది. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసి.. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే ఈ చిత్రంలో సామ్ బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. సమంతను ఈ సినిమాకు రికమెండ్ చేసింది దగ్గుబాటి వారసుడు రానా నే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పర్టికులర్‌గా బై సెక్సువల్ రోల్లో ఎవర్నీ నటింప చేయాలని సినీ మేకర్స్ ఆలోచిస్తుండగా.. రానా దగ్గుబాటి సమంత పేరుని సజిస్ట్ చేసారట.
దీంతో మేకర్స్ సమంతను అప్రోచ్ అవ్వడం..సమంతకు కధ నచ్చడం..ఆమె సైన్ చేయడం..చకచక జరిగిపోయాయి. అలా సమంత కెరీర్లో అంతర్జాతీయ సినిమాను ఎంపిక చేసుకునే సంచలన నిర్ణయం వెనుక కారణంగా నిలిచిన హీరో రానా దగ్గుబాటి అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.